అశ్విన్‌తో ఏకీభవించను
'అశ్విన్ చెప్పిన చాలా పాయింట్లు నాకు నచ్చాయి. నేను అతను పేర్కొన్న పరిష్కారాలతో నేను పూర్తిగా ఏకీభవించను. స్విచ్ హిట్‌తో మనం కొంత ఆనందించినప్పటికీ.. స్విచ్ హిట్‌ని పూర్తిగా నిషేధించాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫీల్డ్ ప్లేస్ మెంట్ టైంలో కెప్టెన్‌లు బౌలర్లకు అనుగుణంగా వారి ఫీల్డర్లను సెట్ చేసుకుంటారు. ఎంత మంది వెనుకాల ఉండాలి.. లెగ్ సైడ్‌లో ఎంత మంది ఉండాలి. అవి కూడా పవర్ ప్లే నియమాలను అనుసరించి ఉంటాయి.' ఇలాంటి టైంలో స్విచ్ హిట్ ఆడుతూ.. బౌలర్లను మోసం చేసినట్లేనని స్కాట్ స్టైరిస్ స్పోర్ట్స్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల స్విచ్ హిట్ షాట్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలని అతను పేర్కొన్నాడు.
స్పిన్నర్లకు బురిడీ
ఇకపోతే మ్యాక్స్ వెల్, కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్ తదితరులు స్విచ్ హిట్ ఆడడంలో సిద్ధహస్తులు.. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో వీరు తమ ఫుట్ వర్క్ మార్చుకుని బాల్ హిట్ చేయడానికి వీలయ్యే స్థితిలోకి వెంటనే మారిపోయి బౌండరీలు బాదుతుంటారు. ఫలితంగా ఫీల్డింగ్ సెట్టింగ్‌ను బురిడీ కొట్టిస్తుంటారు. కొన్ని సార్లు బ్యాటర్లు పదేపదే హిజీగా స్విచ్ హిట్ ఆడుతుంటే.. స్పిన్నర్ల లెంత్ అండ్ స్ట్రాటజీ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. బ్యాటర్‌కే అనుకూలంగా మారుతుంది.
కావాలంటే రివర్స్ స్వీప్ ఓకే
'నా ఉద్దేశం ప్రకారం.. ఇది అంతా జెన్యూన్ విషయమేం కాదు. ఒకవేళ బ్యాటర్ రివర్స్ స్వీప్ లేదా రివర్స్ హిట్ ఆడవచ్చు దాంట్లో అభ్యంతరం లేదు. కానీ స్విచ్ హిట్ మాత్రం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కెవిన్ పీటర్సన్ లాంటి తదితర ఆటగాళ్లు పూర్తిగా లెఫ్ట్‌హ్యాండర్లుగా హిట్ చేయగలరు. మీరు స్విచ్ హిట్‌ను తీసివేసి.. అన్ని రివర్స్ స్వీప్‌లు, రివర్స్ హిట్‌లను అనుమతిస్తే అశ్విన్ చెబుతున్న ఎల్బీడబ్ల్యూ చట్టం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది బౌలర్ మరియు బ్యాట్స్‌మన్ మధ్య పోటీ న్యాయంగా ఉంటుంది.' అని స్ట్రైరిస్ వెల్లడించాడు. రివర్స్ స్వీప్‌లో బ్యాటర్ తన ఫుట్ వర్క్ ఉపయోగించడు. అతను రైట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండింగ్ స్టైల్లోనే రివర్స్ స్వీప్ ఆడతాడు. కానీ స్విచ్ హిట్ లో మాత్రం అతను కంప్లీట్ తన ఫుట్ వర్క్ మార్చుకుంటాడు. రైట్ హ్యాండర్ అయితే పూర్తిగా లెఫ్ట్ హ్యాండర్ తరహాలో మారి హిట్ చేస్తాడు.


Click it and Unblock the Notifications












