
భారత్‌తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు అతికి పోతే సిరీస్‌లో ఘోరమైన ఓటమి తప్పదని మాజీ లెజెండ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్‌లో ఆడటం అంత సులభం కాదని చెప్పిన మాజీ ప్లేయర్ గిల్ క్రిస్ట్.. ప్రస్తుత ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్‌కు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లండ్, పాకిస్తాన్‌లో ఆడినట్లు కాదని, భారత్‌లో ఆడటం చాలా కష్టమని మరీ మరీ చెప్పాడు.
దాదాపుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ చేరిన ఆసీస్ జట్టు తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు భారత్‌ను ఓడించాలని చూస్తోంది. అదే సమయంలో ఫైనల్ బెర్తు రేసులో ఉండాలంటే భారత జట్టు కూడా ఈ సిరీస్ గెలవక తప్పదు. అందుకోసమే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. భారత పర్యటనకు వచ్చే బృందంలో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. దీనిపై కూడా గిల్‌క్రిస్ట్ కీలక సూచనలు చేశాడు. భారత్‌లో స్పిన్ పిచ్‌లు కదా అని స్పిన్నర్లతో బరిలో దిగినా పొరపాటేనని తేల్చిచెప్పాడు.

'ఈసారి భారత్‌లో ఆడే సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఎలా ఆడుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. గతంలో మేం భారత్‌లో ఆడినప్పుడు వికెట్ల కోసం వెతుకుతూ మొదటి నుంచే స్పిన్నర్లను రంగంలోకి దింపొద్దు. మొదటి బంతి నుంచే వికెట్లను టార్గెట్ చేయాలి. గర్వాన్ని పక్కన పెట్టి ఎగ్రెసివ్‌గా ఉండటం కోసం డిఫెన్సివ్‌గా ఆడక తప్పదు.
ఒక స్లిప్‌తో ఆట మొదలుపెట్టాలి. మిడ్‌వికెట్‌తోపాటు బౌండరీ దగ్గర కూడా ఫీల్డర్లను ఉంచాలి. అప్పుడు బౌండరీలు ఆపొచ్చు. అదే సమయంలో షార్ట్ కవర్ లేదా షార్ట్ మిడ్‌వికెట్ దగ్గర మంచి క్యాచ్‌లు అందుకునే ఫీల్డర్లను ఉంచాలి. ఇక అక్కడి నుంచి సహనంగా వికెట్ కోసం ఎదురు చూడాలి అంతే' అని చెప్పాడు.