INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!

ప్రస్తుతం టీమిండియాలో బెస్ట్ స్పిన్నర్ ఎవరు? అని అడిగితే అందరి మదిలో మొదటగా మెదిలే పేరు కుల్దీప్ యాదవ్. నిలకడగా అవకాశాలు దక్కకపోయినా.. అతను మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనే దీనికి నిదర్శనం. ఆ పర్యటనలో ఆడిన తొలి టెస్టులో కుల్దీప్‌కు అవకాశం దక్కింది. చాలా కాలం తర్వాత తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న కుల్దీప్.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. కానీ ఆ తర్వాతి మ్యాచులోనే అతన్ని బెంచ్‌కు పరిమితం చేశారు.
ఇలా అతను సత్తా చాటినా కూడా పక్కన కూర్చోపెట్టడం చాలా విమర్శలకు దారి తీసింది కూడా. ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ వసీం జాఫర్ గుర్తుచేశాడు. ఇది ఏ ఆటగాడికైనా కష్టమైన పని అని తేల్చేశాడు. 'వరుసగా అవకాశాలు దక్కకపోయినా సరే.. ఆడిన ప్రతి మ్యాచులో రాణించడం అంటే మాటలు కాదు. అది ఎవరికైనా అంత ఈజీ కాదు. కానీ కుల్దీప్ అదే చేస్తున్నాడు. అతనికి అవకాశం వస్తే రాణిస్తున్నాడు. ఆ వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అయినా మళ్లీ అవకాశం వస్తే సత్తా చాటుతున్నాడు' అని కొనియాడాడు. అతనికి కివీస్‌తో తొలి టీ20లో అవకాశం ఇవ్వాలని సూచించాడు.

శ్రీలంక, న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే సిరీసుల్లో ఆడిన కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. ఈ రెండు సిరీసులు భారత్ గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఇటీవలి కాలంలో టీ20ల్లో అతనికి ఆడే అవకాశం రాకపోయినా.. పొట్టి ఫార్మాట్లో కుల్దీప్ గణాంకాలు చాలా బాగున్నాయి. ఈ ఫార్మాట్లో మొత్తం 25 మ్యాచులు ఆడిన అతను 44 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంత మంచి గణాంకాలు ఉన్న అతనికి తొలి టీ20లో అవకాశం ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications