Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యకుమార్ యాదవ్‌ను చూసి నేర్చుకోవాలి.. పాక్ ఓపెనర్‌పై మండిపడ్డ మాజీ లెజెండ్

Former legend wants Pakistan star to learn something from Suryakumar Yadav

సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఈ పేరు తెలియని వాళ్లుండరు. ప్రపంచ నెంబర్ వన్ టీ20 ప్లేయర్‌గా నిలిచిన ఈ ఇండియన్ స్టార్‌కు, పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌తో చాలా మంది పోలికలు తెస్తుంటారు. అయితే ఎదుర్కొన్న తొలి బంతి నుంచి విరుచుకుపడి భారీ షాట్లు ఆడే సత్తా రిజ్వాన్‌లో కనిపించదు. అందుకే భారత అభిమానులు ఈ పోలికను కూడా తప్పు పడుతుంటారు.

పోలిక ఎందుకంటే?

పోలిక ఎందుకంటే?

పొట్టి ఫార్మాట్‌లో నెంబర్ వన్ స్థానం కోసం కొన్ని రోజులుగా రిజ్వాన్, సూర్యకుమార్ మధ్య పోటీ నెలకొంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ నుంచి టీ20 టాప్ బ్యాటర్ స్థానాన్ని అందుకున్న రిజ్వాన్.. కొన్ని రోజులకే దాన్ని సూర్యకుమార్‌కు అప్పజెప్పాల్సి వచ్చింది. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ వస్తున్న రిజ్వాన్ ఒక పక్క తడబడుతుంటే.. సూర్యకుమార్ మరోపక్క చెలరేగి ఆడాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో నెంబర్ వన్ బ్యాటర్ ర్యాంకు అతనికి దక్కింది.

సూర్యకుమార్ విశ్వరూపం..

సూర్యకుమార్ విశ్వరూపం..

ఈ ఏడాది ఆరంభం నుంచే అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచకప్‌లో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలపై హాఫ్ సెంచరీలతో చెలరేగిన అతను.. జింబాబ్వేపై ఆడిన ఇన్నింగ్స్ టోర్నీకే హైలైటె్‌గా నిలిచింది. ముఖ్యంగా అతను కొట్టిన స్కూప్ షాట్ అయితే అందరి మతులూ పోగొట్టింది.

తడబడుతున్న పాక్ టాపార్డర్

తడబడుతున్న పాక్ టాపార్డర్

జింబాబ్వే చేతిలో ఓటమితో అసలు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది అని అనుకున్న పాకిస్తాన్.. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవడంతో అనూహ్యంగా సెమీస్ చేరింది. తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై కూడా పాక్ ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. క్వార్టర్ ఫైనల్ వంటి మ్యాచులో నెమ్మదిగా ఆడుతూ విమర్శల పాలయ్యారు. ముఖ్యంగా రిజ్వాన్ ఆడిన 32 బంతుల్లో 32 పరుగుల ఇన్నింగ్స్‌పై మాజీలు మండిపడ్డారు. చివరి వరకు క్రీజులో నిలవలేనప్పుడు ఇలాంటి ఇన్నింగ్సుల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.

మెచ్చుకున్న పాక్ లెజెండ్

మెచ్చుకున్న పాక్ లెజెండ్

సూర్యకుమార్ గురించి ఒక టీవీ షోలో మాట్లాడిన పాక్ మాజీ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ.. 'ఆ కుర్రాడికి తన ఆట తెలుసు. దేశీయంగా 200-250 మ్యాచులు ఆడటం అతనికి కలిసొచ్చింది. చెత్త బంతులైనా, మంచి బంతులైనా వేటినైనా ఆడగల సత్తా ఉంది' అన్నాడు. సూర్య నుంచి ఈ విషయం రిజ్వాన్ నేర్చుకోవాలా? అంటే తప్పకుండా నేర్చుకోవాలన్నాడు. నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించి ఆ తర్వాత భారీ షాట్లు ఆడే రిజ్వాన్ స్ట్రాటజీ అందరికీ తెలిసిపోయిందని, దాన్ని అతను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, November 8, 2022, 18:07 [IST]
Other articles published on Nov 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+