For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ఆ డబుల్ సెంచరీ కొట్టగానే.. రిటైర్ అయిపోవాల్సింది.. మాజీ షాకింగ్ కామెంట్స్!

Former legend wants aussie star to take retirement

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాలో కీలకమైన సీనియర్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. కానీ అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా రాణించలేదు. తొలి రెండు టెస్టుల్లో చాలా పేలవమైన ప్రదర్వన చేశాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేసే సమయంలో ఒక డెలివరీ వచ్చి అతని భుజాన్ని బలంగా తాకింది. దీంతో ఎక్స్‌రే తీయించారు. దానిలో వార్నర్ భుజం ఎముకపై చీలిక ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని మిగిలిన టెస్టుల నుంచి తొలగిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మూడో టెస్టులో అతని స్థానంలో ట్రావిస్ హెడ్ ఓపెనర్ చేయకున్నాయి.

Former legend wants aussie star to take retirement

ఈ క్రమంలో వార్నర్ గైర్హాజరీలో ఓపెనర్ బాధ్యతలు నిర్వర్తించిన ట్రావిస్ హెడ్.. ఇండోర్ పిచ్‌పై సరైన ఆటతీరు కనబరిచాడు. ఒక్క పరుగు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించాడు. ఇది చూసిన చాలా మంది ఇక ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ ఏం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఇక కనీసం టెస్టుల్లో అయినా అతన్ని తొలగించే సమయం వచ్చేసిందని అంటున్నారు. దీనిపై ఆసీస్ మాజీ లెజెండ్ రికీ పాంటింగ్ కూడా అదే భావన వ్యక్తం చేశాడు. వార్నర్ ఇక టెస్టులకు వీడ్కోలు చెప్పేస్తే మంచిదన్నాడు.

Former legend wants aussie star to take retirement

సిడ్నీ గ్రౌండ్‌లో డబుల్ సెంచరీ చేసినప్పుడే వార్నర్ రిటైర్‌మెంట్ ప్రకటించాల్సిందని, కానీ ఇప్పటి వరకు అనవసరంగా పొడిగించాడని చెప్పాడు. 'ఈ డబుల్ సెంచరీకి ముందే అతను తన 100వ టెస్టు కూడా ఆడాడు. ఇక అప్పుడే తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సింది. నన్నడిగితే అతను రిటైర్‌మెంట్ ప్రకటించే మంచి సమయాన్ని దాటేశాడు. ఆ డబుల్ సెంచరీ కొట్టగానే ప్రకటించేసి చేతులు దులుపుకోవాల్సింది' అని పాంటింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అయినా ఆసీస్ ఇలాగే ఆడుతుందేమో కూడా చూడాలి.

Story first published: Monday, March 6, 2023, 12:15 [IST]
Other articles published on Mar 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+