Team India: టీ20ల్లో కోచ్‌గా అతనే బెస్ట్.. ద్రావిడ్ కన్నా ఎక్కువ తెలుసు.. మాజీ లెజెండ్ సలహా!

ప్రపంచ స్థాయి స్టార్లతో కూడిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి ఘోరమైన పరాభవంతో వెనుతిరగింది. దీంతో అప్పటి నుంచి భారత జట్టు ఆటతీరు, కెప్టెన్సీ, కోచింగ్ ఇలా అన్ని విభాగాలపై విపరీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పనికిరాడని, అతను టెస్టు స్పెషలిస్ట్ అని చాలా మంది అన్నారు. వారిలో మాజీ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఒకడు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని భజ్జీ గట్టిగా చెప్పాడు.

ద్రావిడ్ కన్నా నెహ్రాకే బాగా తెలుసు..
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను తొలగించి ఆశిష్ నెహ్రాను ఆ స్థానంలో నియమించాలని భజ్జీ మరోసారి డిమాండ్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ వద్ద అసామాన్యమైన క్రికెట్ పరిజ్ఞానం ఉందని చెప్పిన భజ్జీ.. 'కానీ ఈ ఫార్మాట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ ఫార్మాట్ ఆడిన వాళ్లు అయితే కోచ్‌గా బాగుంటుంది. ఈ ఫార్మాట్ విషయంలో మాత్రం రాహుల్ కన్నా నెహ్రాకే చాలా ఎక్కువ తెలుసు. కాబట్టి పొట్టి ఫార్మాట్‌లో నెహ్రాను కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది' అని చెప్పాడు.

ఇద్దరు కెప్టెన్లు.. ఇద్దరు కోచ్‌లు..
అబుధాబిలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్న భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓటమి తర్వాత టీ20లకు వేరే కెప్టెన్‌ను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పద్ధతిలో పొట్టి ఫార్మాట్‌లో నెహ్రాను జట్టుకు కోచ్‌గా నియమించాలని భజ్జీ అన్నాడు. అలాగని రాహుల్‌ను తీసేయండి అని తను చెప్పడం లేదని, ఈ ఫార్మాట్‌లో ఇద్దరూ కలిసి కోచింగ్ ఇచ్చినా జట్టుకు మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, ద్రావిడ్ పని భారాన్ని కూడా నెహ్రా పంచుకుంటాడని, కివీస్ టూర్‌లో ద్రవిడ్ విశ్రాంతి తీసుకుంటే ఎన్సీయే చీఫ్ లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి సమయంలో నెహ్రా చాలా ఉపయోగపడతాడన్నాడు.

కోచ్‌గా అద్భుతంగా పని చేసిన ఆశిష్ నెహ్రా..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా అద్భుతంగా పని చేసిన ఆశిష్ నెహ్రా.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాడు. దీంతో ఆ జట్టు వరుస విజయాలతో ఫైనల్ చేరింది. చివరకు రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ట్రోఫీ ముద్దాడింది. ఇలా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన తొలి భారతీయ హెడ్ కోచ్‌గా నెహ్రా రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్ గురించి తనకు బాగా తెలుసునని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని జట్టు కోసం ఉపయోగించుకోవాలని భజ్జీ సలహా ఇస్తున్నాడు. ద్రావిడ్, నెహ్రా కలిసి 2024 టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications