ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం

ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ గెలిచే సత్తా టీమిండియాకు పూర్తిగా ఉందని మాజీ టీమిండియా కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సిరీసుల్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. తాజాగా న్యూజిల్యాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేసింది. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇదే జోరును కొనసాగించాలని సౌరవ్ కోరాడు.

కప్పు కాదు.. ఆట ముఖ్యం..
ప్రస్తుతం భారత జట్టు చాలా బలంగా ఉందని, రాహుల్ ద్రావిడ్ ఇదే కాంబినేషన్‌ను కొనసాగించాలని గంగూలీ చెప్పాడు. అలాగే ఇప్పుడు ఆడుతున్నట్లే ఎటాకింగ్ గేమ్ ఆడాలని సూచించాడు. వన్డే వరల్డ్ కప్‌లో కూడా భారత జట్టు ఇలాగే ఎటాకింగ్ గేమ్ ఆడాలి, కప్పు గెలుస్తామో లేదో తర్వాత చూసుకోవచ్చు అన్నాడు.
వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో కీలకమైన మ్యాచుల్లో ఒత్తిడికి గురై భారత్ ఓడిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. 'వరల్డ్ కప్‌లో ఎలాంటి బ్యాగేజి లేకుండా ధైర్యాంగా ఆడాలి. ట్రోఫీ గెలుస్తామో లేదో తర్వాత.. ముందు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటం ముఖ్యం' అని గంగూలీ చెప్పాడు.

ఎప్పటికీ బలహీన జట్టు కాదు..
భారత్ ఎప్పటికీ బలహీనమైన జట్టు కాలేదని చెప్పిన గంగూలీ.. భారత్ వద్ద ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. 'ఇండియా ఎప్పటికీ వీక్ టీం కాలేదు. ఇంత మంది సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్న జట్టు బలహీనం ఎలా అవుతుంది? వీళ్లలో సగం మందికి ఆడే అవకాశం కూడా రావడం లేదు. అందుకే రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, సెలెక్టర్లకు నేనిచ్చే సలహా ఒకటే.. వరల్డ్ కప్ వరకూ ఇదే టీంను కొనసాగించండి. అనవసరమైన మార్పులు వద్దు' అని సలహా ఇచ్చాడు.

స్టార్లు ఉన్న జట్టు..
'శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఉన్న జట్టు ఎప్పటికీ బ్యాడ్ కాదు. జడేజా కూడా తిరిగొస్తున్నాడు' అని గంగూలీ అన్నాడు. ప్రస్తుతం న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతుంది.
అనంతరం ఆసీస్ జట్టుతోనే వన్డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి దిగిపోయిన గంగూలీ.. వచ్చే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందించనున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications