INDvsAUS : సత్తా చూసి కాదు. పక్షపాతంతోనే ఇన్ని ఛాన్సులు.. టీమిండియా స్టార్‌పై షాకింగ్ కామెంట్స్!

టీమిండియాలో ప్రస్తుతం ఒక్క స్థానం కూడా ఖాళీ లేదు. ప్రతి స్థానం కోసం కనీసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. అలాంటి సమయంలో కేవలం పక్షపాతంతో ఒక ఆటగాడికి వరుసపెట్టి అవకాశాలు ఇస్తున్నారని మాజీ లెజెండ్ వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. ఇతర ఆటగాళ్లు ఎంత గొప్పగా ఆడుతున్నా వాళ్లకు అవకాశాలు రావడం లేదని, కానీ వరుసగా ఫెయిల్ అవుతున్న వాళ్లకు మాత్రం ఛాన్సుల మీద ఛాన్సులు దక్కుతున్నాయని విమర్శించాడు.
ఇది ఫేవరిటజం కాక మరేంటి?
ట్విట్టర్ వేదికగా ఈ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రసాద్.. టార్గెట్ చేసింది మరెవర్నో కాదు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను. ఆసీస్‌తో తొలి టెస్టులో కేవలం 20 పరుగులు చేసి అవుటైన అతనిపై ప్రసాద్ మండిపడ్డాడు. గడిచిన ఎనిమిదేళ్లలో రాహుల్ అంత గొప్పగా ఆడిన సందర్భాలు ఏవీ లేవన్నాడు. '46 టెస్టులు ఆడిన తర్వాత కూడా కేవలం 34 సగటు ఉందంటేనే.. సదరు బ్యాటర్ రికార్డు చాలా సాధారణంగా ఉన్నట్లు. అయినా అతనికి ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు?' అని ప్రశ్నించాడు.
వైస్ కెప్టెన్ చేయడం దారుణం..
శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, దేశవాళీల్లో సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడని ప్రసాద్ గుర్తుచేశాడు. అలాంటి వాళ్లను కాదని రాహుల్‌కు ఇన్ని అవకాశాలు ఇవ్వడానికి పక్షపాతం కాకుండా మరే కారణం తనకు కనిపించడం లేదన్నాడు. 'దారుణం ఏంటంటే అతను జట్టు వైస్ కెప్టెన్. నన్నడిగితే అద్భుతమైన క్రికెట్ బ్రెయిన్ ఉందనే అశ్విన్‌ను వైస్ కెప్టెన్ చెయ్యాలి. లేదంటే పుజారా ఉన్నాడు. రాహుల్ కన్నా మయాంక్ అగర్వాల్ ఈ జట్టుపై మంచి ప్రభావం చూపించాడు' అని విమర్శించాడు.
ఐపీఎల్ గిగ్‌ల కోసం..
కళ్లు ముందు ఇంత ఘోరం జరుగుతున్నా మాజీ క్రికెటర్లు దీనిపై స్పందించడానికి ఇష్టపడరని, అలా చేస్తే తమకు ఐపీఎల్ సమయంలో సమస్యలు వస్తాయని మాజీలు భయపడుతున్నారని అన్నాడు. 'ఒక ఫ్రాంచైజీ కెప్టెన్‌తో గొడవ పడితే.. ఐపీఎల్ సమయంలో తమకు పని దొరకదని కొందరు మాజీలు భయం. అందుకే రాహుల్ విషయంలో వాళ్లు స్పందించరు' అని చురకలేశాడు.
ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో రాహుల్ తన ట్యాలెంట్‌కు తగిన న్యాయం చేయలేదన్నాడు. ఇంతకుముందు విమర్శకులకు ఒక గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు కాలం మారిపోయిందన్ని చెప్పాడు. 'ఇప్పుడు అందరికీ తాము చెప్పినట్లు చేసే వాళ్లే కావాలి. అన్నిటికీ అవునని తలూపాలి. నిజాలు ఎవరికీ అక్కర్లేదు' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications