INDvsAUS : రాహుల్‌కు ఇన్ని అవకాశాలా?.. జట్టుపై నమ్మకం పోతోందన్న మాజీ లెజెండ్!

ప్రస్తుతం టీమిండియాలో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న బ్యాటర్ కేఎల్ రాహుల్. గతేడాది కాలంగా అతను ఏమాత్రం రాణించడం లేదు. ఈ ఏడాది కాలంలో కేవలం ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆస్ట్రేలియా సిరీస్‌కు తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. దానికితోడు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో కేఎల్ రాహుల్‌పై విమర్శలు మరింత పెరిగాయి. మాజీ లెజెండ్ వెంకటేశ్ ప్రసాద్ కూడా రాహుల్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే.. రాహుల్‌కు జట్టులో చోటు ట్యాలెంట్ చూసి కాకుండా, పక్షపాతంతో ఇస్తున్నారని మండిపడిన సంగతి తెలిసిందే.

20 ఏళ్లలో ఇలా జరగలేదు..
తాజాగా మరోసారి రాహుల్‌పై వెంకటేశ్ ప్రసాద్ మండిపడ్డాడు. 'చెత్త ఫామ్ అలాగే కొనసాగుతోంది. ఈ సమస్య అతనితోకాదు.. మేనేజ్‌మెంట్‌తోనే. ఏమాత్రం ఆడేలా కనిపించని ఆటగాడికి అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు. గడిచిన 20 ఏళ్లలో ఒక్క టాపార్డర్ బ్యాటర్ కూడా ఇంత తక్కువ సగటుతో ఇన్ని మ్యాచులు ఆడలేదు' అని గుర్తుచేశాడు. అతన్ని జట్టులోకి తీసుకోవడం అంటే.. సత్తా ఉన్న ఆటగాళ్లకు రావలసిన అవకాశాలను కాలరాయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి ఉదాహరణగా కొందరు వెటరన్ ప్లేయర్ల గణాంకాలను ఉదహరించాడు.

ఎంతమంది ఆటగాళ్లు లేరు?
'టెస్టుల్లో శిఖర్ ధవన్ సగటు 40పైనే. మయాంక్ అగర్వాల్ యావరేజ్ 41పైనే. మయాంక్ రెండు డబుల్ సెంచరీలు కూడా బాదాడు. ఇక గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సర్ఫరాజ్ తన అవకాశం కోసం ఎదరు చూస్తూనే ఉన్నాడు. చాలా మంది దేశవాళీ స్టార్లు సత్తా చాటుతున్నా అవకాశాలు మాత్రం రావడం లేదు' అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు. 'నన్ను అడిగితే.. భారత్‌లో ప్రస్తుతం ఉన్న టాప్ టెన్ ఓపెనర్లలో రాహుల్ ఒకడు. కానీ అతనికి మరీ ఎక్కువ ఛాన్సులు ఇస్తుననారు. కుల్దీప్ యాదవ్ వంటి వాళ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే ప్రదర్శన చేసినా.. తర్వాతి మ్యాచ్‌లోనే పక్కన పెట్టేస్తున్నారుగా' అని అన్నాడు.

న్యాయంపై నమ్మకం పోతోంది
'రేసుల్లో గుర్రాలను పక్కన పెట్టేసినట్లు.. రకరకాల థియరీలు చెప్పేసి కుల్దీప్ వంటి ఆటగాళ్లను పక్కన పెడుతున్నారు. కానీ ఏ రేసులో చూసినా కేఎల్ రాహుల్ గుర్రం కాకపోవడం బాధాకరం' అని చెప్పుకొచ్చాడు. రాహుల్‌ను జట్టులో ఇంకా ఆడిస్తుంటే న్యాయంపై నమ్మకం పోతోందని వెంకటేశ్ ప్రసాద్ బాధపడ్డాడు. 'ఎస్ఎస్ దాస్ చాలా ట్యాలెంట్ ఉన్న ఆటగాడు. అలాగే ఎస్ రమేష్ కూడా. ఇద్దరి సగటు 38పైనే ఉంది. కానీ వీళ్లిద్దరూ కూడా 23 టెస్టులకు మించి ఆడలేదు. రాహుల్‌ను ఇలా కంటిన్యూగా ఆడిస్తుంటే.. భారత్‌లో బ్యాటింగ్ ట్యాలెంట్ లేదనే అపోహ కల్పిస్తుంది. ఇది నిజం కాదు. చివరి ఐదేళ్ల లెక్కలు చూసుకుంటే అతను 47 ఇన్నింగ్సుల్లో 27 కన్నా తక్కువ సగటుతో పరుగులు చేశాడు' అని విమర్శించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications