
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు అద్భుతంగా పోరాడింది. కుశాల్ మెండిస్, దాసున్ షనక అద్భుతమైన హాఫ్ సెంచరీలు చేశారు. అదే సమయంలో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో లంక బ్యాటర్లు 206 పరుగుల భారీ స్కోరు చేశారు.
ఈ క్రమంలో యువ పేసర్ అర్షదీప్ సింగ్ మరోసారి స్పాట్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. అతను బౌలింగ్ చేసిన ప్రతిసారీ కాలు గీత దాటుతూనే ఉంది. దీనిపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా అర్షదీప్‌ను తప్పుబట్టాడు. బ్యాటర్లు అన్న తర్వాత అనవసరమైన షాట్లు ఆడటం, బౌలర్లు నోబాల్స్ వేయడం సహజమే అని గంభీర్ చెప్పాడు.
కానీ ఒకే మ్యాచ్‌లో ఇన్ని నోబాల్స్ ఎలా వేస్తారని అర్షదీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరైనా ఆటగాడు గాయం నుంచి కోలుకుంటే.. పూర్తి ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అనేది ప్రధాన సమస్య కాదని, వాళ్లు అంతర్జాతీయ ఆటకు కావలసిన రిథమ్‌లో ఉన్నారా? అనేదే ప్రశ్న అని చెప్పాడు. అర్షదీప్ సింగ్ తను ఆ రిథమ్‌లో లేకపోవడం వల్లే అన్ని నోబాల్స్ వేశాడని వివరించాడు. అందుకే ఎవరైనా ఆటగాడు గాయపడితే.. నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రాకూడదని సలహా ఇచ్చాడర.
'గాయం నుంచి కోలుకుంటే ముందు దేశవాళీలు ఆడాలి. కనీసం 15-20 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అప్పుడు మన రిథమ్ తిరిగొస్తుంది. ఆ తర్వాత అంతర్జాతీయ ఆటకు తిరిగి రావాలి. అంతేకానీ నేరుగా గాయం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చేస్తే.. ఇలాగే ఉంటుంది. సరైన రిథమ్ ఉండదు. దాన్ని వెతుక్కోవడానికి టైం చాలదు' అని అర్షదీప్‌పై విమర్శలు గుప్పించాడు గంభీర్. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో గాయం నుంచి కోలుకోని సందర్భంగా.. అర్షదీప్ ఆ మ్యాచ్ ఆడలేదు.