INDvsNZ : ఇషాన్ కిషన్ కోసం కోహ్లీ ఆ త్యాగం చేయాలి.. మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్

బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగినా కూడా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కలేదు. టీ20ల్లో అతనికి అవకాశం వచ్చినా.. వన్డే ఫార్మాట్లో అతన్ని పక్కన పెట్టేసింది టీం మేనేజ్‌మెంట్.
ఈ నిర్ణయంపై చాలా విమర్శలు వచ్చాయి. శ్రీలంక సిరీస్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా కిషన్‌కు ఛాన్స్ ఇవ్వలేదు కెప్టెన్ రోహిత్ శర్మ. సిరీస్ గెలిచిన తర్వాత మూడో వన్డేలో కూడా అతన్ని ఆడించలేదు.

భరత్, కిషన్ ఎవరు ఆడాలి?
ఈ క్రమంలో కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కిషన్‌కు అవకాశం లభించేలా ఉంది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లేకపోవడంతో కిషన్, కేఎస్ భరత్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కిషన్ మిడిలార్డర్ బ్యాటర్ కాదు. ఈ కారణంగా భరత్ ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ కిషన్‌కే అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు అంటున్నారు. అతని కోసం టాపార్డర్‌లో ఖాళీ లేదనే సమస్యకు తాజాగా భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఒక సూచన చేశాడు

కిషన్ ఆడాల్సిందే..
సమానమైన అవకాశాలు ఇవ్వాలనే కారణంతోనే లంక వన్డే సిరీస్‌లో గిల్‌ను తీసుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఇప్పుడు ఇదే కారణంతో కిషన్‌కు కూడా అవకాశం ఇవ్వాలని మంజ్రేకర్ అన్నాడు. అయితే గిల్‌ను జట్టులో నుంచి తీసేయడం కూడా కరెక్ట్ కాదన్నాడు. దీనికి అతను ఒక కొత్త పరిష్కారం చెప్పాడు. కిషన్ కోసం జట్టులో ఆ మాత్రం మార్పులైనా చేయాలని సూచించాడు. బంగ్లాదేశ్‌లో డబుల్ సెంచరీ కొట్టిన అతనికి అవకాశాలు ఇవ్వడమే కరెక్ట్ అన్నాడు.

కోహ్లీ త్యాగం చేయాలి
కిషన్‌కు జట్టులో అవకాశం ఇవ్వడం కోసం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్యాగం చేయాలని మంజ్రేకర్ అన్నాడు. ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్ కిషన్ వస్తే బాగుంటుందన్నాడు. 'డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడు. దానికితోడు టాపార్డర్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఉండటం మంచిదే. ఆ తర్వాత మూడో స్థానంలో గిల్ ఆడతాడు. అతను ఈ స్థానాన్ని చక్కగా పోషించగలడు అని నాకు అనిపిస్తోంది. దీని కోసం కోహ్లీ తన మూడో స్థానాన్ని త్యాగం చేసి, ఆ తర్వాతి స్థానంలో రావాలి' అని చెప్పాడు. కోహ్లీ ఇలా తన స్థానాన్ని త్యాగం చేయడం ఇదేం కొత్త కాదని చెప్పాడు. గతంలో అంబటి రాయుడు కోసం కూడా కోహ్లీ ఇలాగే చేశాడని గుర్తు చేశాడు. మరి కివీస్‌తో తొలి వన్డేలో రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications