INDvsBAN: రోహిత్ లేడు కాబట్టి.. ఆ సమస్య తీరినట్లే.. మాజీ లెజెండ్ సంచలన కామెంట్స్

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధం అవుతోంది. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలపాలవడంతో భారత జట్టులో కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సి వచ్చింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇద్దరూ గాయాలతో వన్డే సిరీస్ కూడా ఆడలేదు. ఇక టెస్టు సిరీస్‌లో కూడా వీళ్లు ఆడటం లేదని తేల్చి చెప్పిన బీసీసీఐ.. వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

గాయాలతో దూరమైన సీనియర్లు..
ఈ సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం భారత్‌కు ఇబ్బందే. అదే సమయంలో బంగ్లాతో రెండో వన్డేలో బొటన వేలికి తీవ్రమైన గాయం అవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ సమయానికి అతను జట్టుతో కలుస్తాడని సెలెక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తొలి టెస్టులో రోహిత్ లేకపోవడం మంచి విషయమేనని మాజీ లెజెండ్ మహమ్మద్ కైఫ్ అంటున్నాడు. రోహిత్ గైర్హాజరీలో జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

రోహిత్ లేకపోవడం మంచిదే..
భారత్‌కు ఈ టెస్టు సిరీస్‌లో అతి పెద్ద సమస్య ఓపెనర్లను ఎంపిక చేయడమని మాజీ లెజెండ్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్.. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరిని ఆడించాలనేది కోచ్ ద్రావిడ్‌కు అతి పెద్ద సమస్యగా మారేదని కైఫ్ చెప్పాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ లేకపోవడంతో ఆ సమస్య తీరిపోయినట్లేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ లేడు కాబట్టి కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ జట్టుకు ఓపెనర్లుగా వస్తారని స్పష్టం చేశాడు.

యువప్లేయర్‌కు నో ఛాన్స్..
రోహిత్ స్థానంలో ఎంపిక చేసిన అభిమన్యు ఈశ్వరన్‌కు తొలి టెస్టులో చోటు దక్కే అవకాశం దాదాపు దక్కదని కైఫ్ చెప్పాడు. గిల్, రాహుల్ ఉండగా మరో ఓపెనర్ కోసం జట్టు వెతకడం జరగదని అభిప్రాయపడ్డాడు. ఈశ్వరన్ కూడా ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచుల్లో రెండు సెంచరీలు సాధించాడు. కానీ తొలి టెస్టులో మాత్రం అతనికి అవకాశం దక్కే ఛాన్స్ లేదనేది కాదనలేని సత్యమని కైఫ్ అన్నాడు.

టీమిండియా ఆర్డర్ ఇదే..
రోహిత్ లేని సమయంలో గిల్, రాహుల్ ఓపెర్లుగా వస్తారని చెప్పిన కైఫ్.. ఆ తర్వాత వరుసగా పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ వస్తారని వివరించాడు. ఆ తర్వాత అశ్విన్ సహా మిగతా బౌలర్లు ఆడతారని అభిప్రాయపడ్డాడు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పని సులువైందని చెప్పాడు. మరి తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లుగా ఎవరు బరిలో దిగుతారో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications