For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!

 Former legend says Prithvi Shaw will not play in first INDvsNZ T20I

కివీస్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షాకు అవకాశం లేదని మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పష్టం చేశాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ చక్కగా ఆడుతున్నాడని, అతనికే తాను ఓటేస్తానని చెప్పాడు. ఇటీవలి కాలంలో గిల్ సూపర్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే టీ20 ఫార్మాట్లో గిల్ అంత గొప్పగా రాణించలేదు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.

మూడో టీ20లో కూడా అంత గొప్పగా ఆడలేదు. అయినా సరే గిల్‌కే అవకాశం ఇవ్వాలని ఆకాష్ చోప్రా అంటున్నాడు. అలాగే, రాంచీ మైదానం మాజీ లెజెండ్ ఎంఎస్ ధోనీ హోం గ్రౌండ్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ధోనీ ఆడటం లేదు కాబట్టి, అతని శిష్యుడు ఇషాన్ కిషన్ ఆడతాడని తేల్చేశాడు. ఇక్కడ ఇంతకుముందు ఇషాన్ కిషన్ చక్కని ఇన్నింగ్స్ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. ఈ క్రమంలో కిషన్‌కు జోడీగా ఎవరు వస్తారనే దానిపై తర్జన భర్జన ఉందన్నాడు.

కిషాన్‌కు జోడీగా పృథ్వీ షా లేదా గిల్ ఇద్దరిలో ఒకళ్లను పంపాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ క్రమంలో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్‌కే ఈ అవకాశం లభిస్తుందని, పృథ్వీ షా వెయిట్ చేయక తప్పదని తేల్చేశాడు. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠీ ఆడతాడని, ఇక ఆ తర్వాత లైనప్ అందరికీ తెలిసిందే అని చెప్పాడు.

సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా తదితరులు ఆడతారన్నాడు. అలాగే జట్టులో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలని సూచించాడు. అయితే శ్రీలంకపై బ్యాటుతో కూడా ఫర్వాలేదనిపించిన శివమ్ మావిని టీమిండియా ఆడించే అవకాశం ఉంది. ఇక ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ లేదా చాహల్ కూడా ఆడతారని తెలిపాడు.

Story first published: Friday, January 27, 2023, 10:38 [IST]
Other articles published on Jan 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+