T20 World Cup: ఫైనల్ ఎలా చేరామో ప్రపంచానికి తెలుసు.. పాక్ టీంపై మాజీ పేసర్ వెటకారం

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని విషయం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఫైనల్ చేరడమే. భారత్ చేతిలో ఓటమితో టోర్నీ ఆరంభించిన దాయాదులు.. తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో కూడా పరాజయం పాలయ్యారు. దీంతో ఇక పాకిస్తాన్ ఇంటికే అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఫైనల్ చేరిన ఆ జట్టు బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోవడంతో ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయింది.

ప్రపంచానికి తెలుసు..
ఫైనల్‌లో పాక్ ఓటమిపై ఆ జట్టు మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ వెటకారమాడాడు. పాక్ జట్టు ఫైనల్‌లో ఆడటమే గొప్ప విషయం అన్నాడు. 'మనం ఫైనల్ ఎలా చేరామో ప్రపంచం మొత్తానికి తెలుసు. అల్లా మనకు సాయం చేశాడు. మన బ్యాటర్ల ప్రదర్శన చూస్తే ఫలితం ముందే అర్థం అయిపోతుంది' అని చెప్పాడు. సిడ్నీ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి ఫలితమే వస్తుందని ఆమిర్ ముందే ఊహించాడు. అదే విషయాన్ని మరోసారి చెప్పాడు.

భారత్ మ్యాచ్‌తో కంపారిజన్
భారత్‌తో పాక్ ఆడిన తొలి మ్యాచ్‌లో పిచ్ నుంచి బౌలర్లకు కూడా మంచి సహకారం అందింది. 'భారత్‌తో మ్యాచ్‌లో ఉన్నట్లే పిచ్ ఉంటే పాకిస్తాన్ మళ్లీ తడబడుతుందని ముందే చెప్పా. అదే జరిగింది. టాస్ తర్వాత మనకు మంచి ఆరంభమే దక్కింది. అక్కడి పరిస్థితులు మనకు తెలుసు' అన్నాడు. అయినా పాక్ మాత్రం తను అంచనా వేసినట్లే స్ట్రగుల్ అయిందన్నాడు. ఫైనల్‌లో పాక్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చాలా నిదానంగా ఆడటంతో 137/8 స్కోరు మాత్రమే చేసింది. బెన్ స్టోక్స్ (52 నాటౌట్) రాణించడంతో లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది.

సెమీస్ ఎలా చేరిందంటే?
ఈ టోర్నమెంట్‌ను భారత్ చేతిలో ఉత్కంఠ భరిత ఓటమితో ప్రారంభించిన పాకిస్తాన్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో కూడా చివరి బంతికి ఓటమి చవిచూసింది. అయితే గ్రూప్-2లో ఓటమి ఎరుగని సౌతాఫ్రికాను ఓడించింది. అనంతరం నెదర్లాండ్స్‌పై కూడా గెలిచింది. కానీ అప్పటికే దాదాపుగా సౌతాఫ్రికా, ఇండియా సెమీస్ చేరతాయని అంతా అనుకున్నారు.
అలాంటి సమయంలో అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి చవి చూసింది. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన పాక్ సెమీస్ చేరుకుంది. సెమీఫైనల్ ఒక్కటే పాకిస్తాన్ జట్టు గట్టిగా ఆడి గెలిచిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications