
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై ఇప్పటి వరకు విమర్శలే వచ్చాయి. అతను జట్టులో అనవసరంగా ఉన్నాడని, ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు భారమని తిట్టిపోశారు. రాహుల్ కూడా ఏమాత్రం నిలకడలేని ఆటతో తనపై విమర్శలు కరెక్టే అనే పరిస్థితి కల్పించుకున్నాడు. అయితే కోల్‌కతాతో జరిగిన భారత్, శ్రీలంక రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడి తన విమర్శకులకు సరైన సమాధానం చెప్పాడు.
రిషభ్ పంత్ లేని సమయంలో వన్డేల్లో వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నెరవేరుస్తున్న కేఎల్ రాహుల్.. బ్యాటింగ్‌లో కూడా చక్కగా రాణిస్తున్నాడు. గువాహతిలో జరిగిన తొలి వన్డేలో వేగంగా ఆడే క్రమంలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన అతను.. రెండో వన్డేలో జట్టును గెలిపించే బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నాడు. ఒకవైపు టపటపా వికెట్లు కూలుతున్నా పట్టుదలగా ఆడాడు. చివరకు 64 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో చాలా మంది విమర్శకులు, అభిమానులు రాహుల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

రాహుల్ ఇలా కీలక ఇన్నింగ్స్ ఆడటం నిజంగా జట్టుకు శుభసూచకం అని మాజీ లెజెండ్ వసీం .జాఫర్ అన్నాడు. 'సాధారణంగా అన్ని ఫార్మాట్లు కలిపి మాట్లాడేస్తాం కానీ.. రాహుల్ వన్డే క్రికెట్‌లో చాలా నిలకడగా రాణిస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే భారత జట్టులో అతని చోటుకు ఏమాత్రం ఢోకా ఉండదు. ఫిట్‌గా ఉంటే రిషభ్ పంత్ మాత్రమే రాహుల్ స్థానానికి పోటీ ఇస్తాడు.
ఇక మిగతా వాళ్లు ఎవరూ రాహుల్‌ను ఎవరూ టచ్ కూడా చేయలేరు' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్లో చక్కగా రాణిస్తున్న రాహుల్ 50 పైగా సగటుతో రాణించాడు. ఇలాంటి వాడు కచ్చితంగా జట్టు మిడిలార్డర్‌లో కచ్చితంగా ఉండాల్సిందేనని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు కూడా రాహుల్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.