Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: కోహ్లీ తర్వాత అతనే టాప్ బ్యాటర్.. యువ ప్లేయర్‌కు మాజీ లెజెండ్ కితాబు

Former Legend says Gill is the next big thing after Virat Kohli

టీమిండియాకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మూల స్తంభమో అందరికీ తెలిసిందే. సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ నుంచి వచ్చిన అత్యుత్తమ క్రికెటర్‌గా కోహ్లీకి పేరుంది. ఇప్పుడు అంతటి స్థాయి ఉన్న మరో ఆటగాడు కూడా మట్టిలో మాణిక్యంలా వెలుగు చూస్తున్నాడని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అంటున్నాడు. జాఫర్ చెప్పిన మాణిక్యం వేరేవరో కాదు బంగ్లాదేశ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో తన తొలి టెస్టు శతకం సాధించిన శుభ్‌మన్ గిల్.

కోహ్లీ స్థాయి ప్లేయర్

కోహ్లీ స్థాయి ప్లేయర్

భారత క్రికెట్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి స్థాయి ఆటగాడు గిల్ అని జాఫర్ కితాబిచ్చాడు. తన దృష్టిలో గిల్ మూడు ఫార్మాట్లూ ఆడగలిగే ఆటగాడని చెప్పాడు. గిల్ తొలి టెస్టు సెంచరీ గురించి కూడా మాట్లాడిన జాఫర్.. 'ఇప్పటికైనా ఆ సెంచరీ వచ్చినందుకు సంతోషం. చాలా సార్లు ఈ అవకాశం అతని చేయి జారింది. చివరకు ఆ మైలు రాయి అందుకోవడంతో గిల్‌పై చాలా భారం తగ్గుతుంది. అతనో క్లాస్ ప్లేయర్. కోహ్లీ తర్వాత.. బహుశా భారత క్యాంప్ నుంచి వచ్చిన అత్యుత్తమ బ్యాటర్ అతనే' అని మెచ్చుకున్నాడు.

అదరగొట్టిన గిల్..

అదరగొట్టిన గిల్..

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో తనకు దక్కిన మంచి ఆరంభాన్ని గిల్ వృధా చేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 20 వద్ద అనవసర షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అలాంటి పొరపాటు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకొని ఆడాడు. మధ్యలో జోరు పెంచాలని జట్టు సూచించినప్పుడు వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే 150 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇది గిల్ కెరీర్‌లో తొలి టెస్టు శతకం కావడం గమనార్హం. ఇది చూసిన అభిమానులు గిల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక గొప్ప కెరీర్‌కు ఇది ఆరంభమని, అతను భవిష్యత్తులో మరెంతో సాధిస్తాడని మెచ్చుకుంటున్నారు.

రాహుల్‌పై షాకింగ్ కామెంట్స్..

రాహుల్‌పై షాకింగ్ కామెంట్స్..

గిల్‌ను చాలా మెచ్చుకున్న వసీం జాఫర్ అదే సమయంలో టీమిండియా సారధి కేఎల్ రాహుల్‌పై విమర్శలు చేశాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 22, 23 పరుగులు మాత్రమే చేసిన అతను సరిగా ఆడటం లేదని, కానీ వైస్ కెప్టెన్ కాబట్టి జట్టులో నుంచి అతన్ని తీసేయడం జరగదని చెప్పాడు. 'పాత సామెత ఒకటుంది. బ్యాటర్ సరిగా ఆడకపోతే బౌలర్‌పై వేటు పడుతుందని.

నాకు తెలిసి రెండో టెస్టులో అదే జరుగుతుంది. ఒక స్పిన్నర్‌ను తీసేసి రోహిత్ శర్మకు జట్టులో చోటు కల్పిస్తారు. వైస్ కెప్టెన్ హోదాలో రాహుల్‌కు జట్టులో చోటు దక్కుతుంది' అని చెప్పాడు. ఈ ఏడాది రాహుల్ అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, December 17, 2022, 7:02 [IST]
Other articles published on Dec 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+