For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా తిరిగొచ్చినా అన్ని ఫార్మాట్లూ ఆడలేడు.. మాజీ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Former legend says Bumrah needs change his bowling action

వెన్నునొప్పితో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పుడు పునరాగమనం చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఐపీఎల్‌లో అతను మళ్లీ మైదానంలో అడుగు పెడతాడని అంతా అనుకున్నారు. కానీ తాజా నివేదికల ప్రకారం, అతను ఐపీఎల్‌లోనే కాదు ఆ తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో బుమ్రా పునరాగమనం చేసినా, తన బౌలింగ్ విధానాన్ని మార్చుకోవాల్సి వస్తుందని మాజీ దిగ్గజం సాబా కరీం అంటున్నాడు.

అన్ని ఫార్మాట్లు ఆడటం కష్టం..

అన్ని ఫార్మాట్లు ఆడటం కష్టం..

'బుమ్రా గాయం చూస్తుంటే అతను తిరిగి వచ్చినా తన బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాల్సి వస్తుందని అనిపిస్తోంది. తన కెరీర్‌ను మరింత పొడిగించుకోవాలంటే బుమ్రా దగ్గర మరో ఆప్షన్ లేదు. అంతేకాదు, తన ఏయే ఫార్మాట్లలో ఆడాలో కూడా అతను ఒక నిర్ణయానికి రావల్సి ఉంటుంది. బుమ్రా లేకుండా కూడా రాణించే బౌలింగ్ యూనిట్ తయారు చేయాల్సిన అవసరం ఉందని టీమిండియా మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో జట్టు ఎంపిక చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది' అని సాబా కరీం వివరించాడు.

బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలా?

బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలా?

బుమ్రా బౌలింగ్ యాక్షన్ మిగతా బౌలర్లకు భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీని వల్ల అతని వెన్నుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని, అందుకే అతను ఇలా గాయాలపాలవుతున్నాడని కరీం వివరించాడు. బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కూడా చక్కగా ఉందన్నాడు. మొదట పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన అతను ఆ తర్వాత టెస్టులు ఆడాడని, మ్యాచుల మధ్యలో బుమ్రాకు విశ్రాంతి కూడా దొరికేదని గుర్తుచేశాడు. గతేడాది వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా ఆ తర్వాత పునరాగమనం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

మరింత కాలం దూరం..

మరింత కాలం దూరం..

గతేడాది టీ20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీసులో అతన్ని బీసీసీఐ ఆడించింది. కానీ దీని వల్ల బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో అతనికి కావలసినంత విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ కూడా నిర్ణయించుకుంది. అతను లేకుండానే జట్టు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో బుమ్రా తిరిగి వస్తాడని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ సిరీస్ తర్వాత జరిగే వన్డేల్లో ఆడతాడని చెప్పినా అది కూడా జరగలేదు. ఇప్పుడు వచ్చే ఐపీఎల్‌లో కూడా బుమ్రా ఆడటం అసాధ్యమని తెలుస్తోంది. జూన్ నెలలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా బుమ్రా సేవలు అందుబాటులో ఉండటం కుదరదని బీసీసీఐ చెప్తోంది.

Story first published: Tuesday, February 28, 2023, 7:55 [IST]
Other articles published on Feb 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+