For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ఫెయిలైనా కూడా.. గిల్ చేసింది కరెక్టే అంటున్న మాజీ దిగ్గజం!

Former legend backs Shubman Gill despite his failure

ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు అత్యంత ఘోరంగా ఆడింది. ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. కానీ ఆ నిర్ణయం ఏమాత్రం కలిసిరాలేదు. పిచ్ నుంచి బౌలర్లకు అద్భుతమైన సహకారం అందడంతో భారత బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 109 పరుగులకే ఆలౌట్ అయింది.

ఫెయిలైన గిల్..

ఫెయిలైన గిల్..

అదే సమయంలో కొంచెం పట్టుదలగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాత్రం 193 పరుగులు చేయగలిగింది. ఇలా 84 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ మళ్లీ తొలి ఇన్నింగ్స్ కథనే రిపీట్ చేసింది. కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి మరీ తీసుకున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5) అనవసరంగా రెక్లెస్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీంతో అతన్ని కొందరు మాజీలు విమర్శించారు. ఇలా రెక్లెస్‌గా ఆడితే ఎలా? అంటూ గిల్‌పై విమర్శలు వచ్చాయి. అయితే గిల్ చేసిన పనే కరెక్ట్ మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ అంటున్నాడు.

గిల్ చేసింది కరెక్టే..

గిల్ చేసింది కరెక్టే..

'పరుగులు చేయడానికి పనికొచ్చే ప్రతి అవకాశాన్ని పట్టుకోవాలి. అక్కడ ఫోర్ వస్తుంది అనుకుంటే ట్రై చెయ్యాలి. గిల్ సిక్సర్ కొట్టాలని అనుకున్నాడు. ఇక్కడి పిచ్ కనుక చూస్తే.. అతని ఆటతీరే కకెర్ట్. ఎందుకంటే ఇక్కడ కేవలం డిఫెండ్ చేసుకుంటూ ఎక్కువ సేపు క్రీజులో ఉండటం కుదరదు' అని భజ్జీ వివరించాడు. ఇండోర్ పిచ్ గురించి కూడా భజ్జీ మాట్లాడాడు. 'ఇక్కడ గేమ్ ప్లాన్ చాలా సింపుల్. ఈ పిచ్‌పై కేవలం డిఫెన్స్ ఆడుతూ ఉండటం కుదరదు. పుజారా ఇన్నింగ్స్ చూడండి. అతను తన ఫుట్‌వర్క్ వాడుతూనే ఉన్నాడు' అని చెప్పాడు.

అలా ఆడటం కుదరదు..

అలా ఆడటం కుదరదు..

'ఈ పిచ్‌పై ఏదో ఒక స్పెల్ వరకు డిఫెండ్ చేసుకొని, తర్వాతి స్పెల్‌లో పరుగులు చేయడం కుదరదు. అలా చెయ్యలేం. ఎవరైనా సరే 70-80 పరుగులు చేసి ఉన్నా సరే.. ఏదో ఒక డెలివరీ కొంచెం భిన్నంగా వచ్చి నీ వికెట్ తీసుకుంటుంది' అని భజ్జీ పేర్కొన్నాడు. కాబట్టి గిల్ ఆటతీరును తప్పుపట్టలేం అన్నాడు. అయితే గిల్ కూడా పంజాబీ అని అతన్ని భజ్జీ వెనకేసుకొస్తున్నాడని కొందరు అంటున్నారు. అతను ఈ టెస్టులో ఫెయిలైనందుకు రాహుల్‌ను పక్కన పెట్టల్లా తీసుకుంటే తను ఏం చేశాడు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి చివరి టెస్టులో అయినా గిల్ రాణిస్తాడేమో చూడాలి.

Story first published: Thursday, March 2, 2023, 18:05 [IST]
Other articles published on Mar 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+