అందరికీ సమాన అవకాశాలు దక్కాలిగా.. డీకేపై విమర్శలకు మాజీ లెజెండ్ సమాధానం

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరింది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయంతో భారత్‌కు సెమీస్ బెర్తు ఖరారైంది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు సరిగా రాణించని ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి దాకా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై కూడా విమర్శలు వచ్చాయి. అయితే బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతను కూడా ఫామ్‌లోకి వచ్చాడు.

డీకేపై విమర్శలు..
ఇప్పటి వరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విరాట్ కోహ్లీ రాణించాడు. మిగతా ఆటగాళ్లు కూడా కనీసం ఒక్కో మ్యాచ్‌లో అయినా సత్తా చాటారు. కానీ డీకే మాత్రం రాణించలేదు. మొత్తం మూడు మ్యాచుల్లో డీకేకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే సౌతాఫ్రికా మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు అండగా నిలిచిన డీకే.. మిగతా మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో జట్టులో అతని స్థానంపై విమర్శలు వస్తున్నాయి.

పంత్‌ను తీసుకోవాలని డిమాండ్లు
బ్యాటింగ్‌లో విఫలమైన డీకే పలుమార్లు కీపింగ్‌లో కూడా తడబడ్డాడు. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక వేగంగా రియాక్ట్ అవడానికి ఇబ్బంది పడుతూ కనిపించాడు. అదే సమయంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అసలు ఈ టోర్నీలో అవకాశమే దక్కలేదు. దీంతో అతని అభిమానులు కూడా డీకేపై విమర్శలు చేశారు. రాహుల్ కూడా టోర్నీ ఆరంభంలో విఫలమవడంతో పంత్‌ను తీసుకుంటే కీపర్ బాధ్యతలు, ఓపెనర్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తాడనేది వాళ్ల వాదన.

మూడు మ్యాచుల్లో ఆడకపోతే?
డీకేపై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. దినేష్ కార్తీక్‌కు గాయమైతే పంత్‌ను తీసుకోవాలని, ఫిట్‌గా ఉంటే డీకేను ఆడించాలని భజ్జీ స్పష్టం చేశాడు. డీకేను ఫినిషర్‌గా తీసుకున్నారని చెప్పిన భజ్జీ.. పంత్‌ను ఈ స్థానంలో ఆడించలేరని వివరించాడు. జట్టులో మిగతా ఆటగాళ్లు కూడా విఫలమయ్యారని, కానీ కార్తీక్ ఒక్కడి గురించే మాట్లాడటం సమంజసం కాదని అన్నాడు.

లోయర్ ఆర్డర్‌కు కూడా బ్యాకింగ్ ఇవ్వాలి..
'డీకే చేసే పని అందరి కన్నా కష్టమైంది. అతని తర్వాత ఫినిషర్‌గా కేవలం హార్దిక్ పాండ్యా ఒక్కడే కనిపిస్తున్నాడు. ఎటూ డీకేకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకొన్ని అవకాశాలు ఇవ్వాలి' అని చెప్పాడు. తను చాలా కష్టపడి విలువైన పరుగులు చేసి జట్టులో స్థానం సంపాదించాడని తెలిపాడు. 'అవును, డీకే మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు. అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి కదా. టాపార్డర్‌కు మద్దతు ఇస్తున్నప్పుడు, లోయర్ ఆర్డర్ వారకి కూడా అలాగే బ్యాకింగ్ ఇవ్వాలి కదా' అని భజ్జీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications