INDvsSL: సూర్య ఆటపై మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. మాజీ లెజెండ్ సీరియస్ కామెంట్స్

శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక చతికిలపడటంతో భారత జట్టు 2-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.

మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్..
సూర్య ఆటతీరుపై మాజీ ఓపెనర్, క్రికెట్ లెజెండ్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సూర్య ఇన్నింగ్స్ అత్యద్భుతంగా ఉందని, దాన్ని వర్షించడానికి తన వద్ద మాటలు కూడా లేవని గంభీర్ అన్నాడు. అయితే ఒక్క మాట మాత్రం చెప్తానన్న గౌతీ.. సూర్యను టెస్టు క్రికెట్ కూడా ఆడించాలని, వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇలాంటి ఆటగాళ్లు టెస్టుల్లో కూడా కీలకంగా మారతారన్న అతను.. సూర్య ఒక్కటంటే ఒక్కటి కూడా రిస్క్ ఉన్న షాట్ ఆడలేదన్నాడు.

అతనికి రిస్క్ కానే కాదు
సూర్యకుమార్ ఆడే షాట్లలో చాలా రిస్క్ ఉన్నట్లు కనిపించినా.. అతను చాలా నిలకడగా ఆ షాట్లు ఆడి ఫలితం రాబడుతున్నాడు. అదే విషయాన్ని గంభీర్ కూడా ఎత్తిచూపాడు. 'ఈ షాట్లన్నీ కూడా సూర్య అమ్ములపొదిలో ఉన్నవే. చాలా మంది ఆటగాళ్లు ల్యాప్ షాట్ ఆడే సమయంలో అది సరిగా ఆడతామా? లేదా? అని భయపడతారు. కానీ సూర్య విషయంలో ఆ ఆలోచనే లేదు. అది అతనికి సహజంగానే వచ్చేస్తుంది. దాన్నే అతను ఇలా తన బలంగా మార్చుకొని, ఎప్పటికప్పుడు ఆ షాట్లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు' అని వివరించాడు.

టీ20ల్లో అత్యంత విలువైన ఆటగాడు
రాజ్‌కోట్ వేదికా జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు పవర్‌ప్లేలో ఆడే అవకాశం రాలేదని గంభీర్ గుర్తుచేశాడు. 'సూర్య ఇన్నింగ్స్ అంతా పవర్‌ప్లే ముగిసిన తర్వాతనే ఆడాడని గుర్తుంచుకవాలి. పవర్‌ప్లే ముగిసిన తర్వాత అతను ఎలాంటి స్ట్రైక్ రేటుతో ఆడాడో అందరూ చూశారు కదా. కాబట్టి టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు అతనే' అని గంభీర్ తేల్చిచెప్పాడు. సూర్య ఆడే షాట్లు ఆడాలంటే మానసికంగా చాలా బలంగా ఉండాలని, అప్పుడే ధైర్యంగా ఆ షాట్లు ఆడగలుగుతారని గంభీర్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications