Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిచర్డ్ హ్యాడ్లీకి క్యాన్సర్ .. బతికుండగానే దాన్ని పూర్తి చేస్తానంటున్న మాజీ ఆల్‌రౌండర్

Former Kiwis fast bowler Richard Hadlee suffers cancer, shares his experience with a smile

క్రైస్ట్ చర్చ్: రిచర్డ్ హ్యాడ్లీ... ఒకప్పటి కివీస్ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం 68 ఏళ్లు వయసున్న రిచర్డ్ హ్యాడ్లీ ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తాడు. రిచర్డ్ హ్యాడ్లీ పైకి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయన ఓ ప్రాణాంతకమైన క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇంతకీ హ్యాడ్లీ ఏ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు..?

ఆల్ రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీకి పెద్దప్రేగు క్యాన్సర్

ఆల్ రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీకి పెద్దప్రేగు క్యాన్సర్

ఒకప్పుడు తన బంతుల వేగంతో ప్రత్యర్థులను గడగడలాడించిన కివీస్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ పెద్ద ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎప్పుడూ అందరితో నవ్వుతూ చక్కగా పలకరించే హ్యాడ్లీ వెనక ఈ విషాదం ఉందని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం పెద్ద ప్రేగు క్యాన్సర్ నాల్గవ దశలో ఉంది. అయినప్పటికీ ఆయన ముఖంపై చిరునవ్వు చెరగలేదు. అంతేకాదు ఐదవ దశకు ఇంకా చేరలేదు కదా అనే ధైర్యం కూడా హ్యాడ్లీలో కనిపిస్తుంది. 2018లో తనకు పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చిందనే విషయం బయటపడిందని ఇప్పుడు అది నాల్గవ దశలో ఉందని హ్యాడ్లీ చెప్పారు. అయితే చివరి దశకు ఇంకా చేరలేదని ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు నవ్వుతూ చెప్పాడు హ్యాడ్లీ.

 ముఖంపై చెరగని చిరునవ్వు హ్యాడ్లీ సొంతం

ముఖంపై చెరగని చిరునవ్వు హ్యాడ్లీ సొంతం

హ్యాడ్లీ తనకు వచ్చిన క్యాన్సర్‌ పై ఎలా పోరాటం చేస్తున్నాడో చెబుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నప్పటికీ.. హ్యాడ్లీ ముఖంపై మాత్రం చిరునవ్వు చెరగలేదు. పెద్ద ప్రేగు క్యాన్సర్ చిన్నగా లివర్‌కు వ్యాపించడంతో తన 15శాతం లివర్‌ను తొలగించినట్లు హ్యాడ్లీ చెప్పాడు. మత్తులో ఉండి నిద్రలోకి జారుకున్న తర్వాత పిత్తాశయం, అపెండిక్స్‌లను తన అనుమతి లేకుండానే వైద్యులు తొలగించారని హ్యాడ్లీ చెప్పాడు. ఆ పై ఆరు నెలల పాటు కీమోథెరపీ తీసుకున్నట్లు చెప్పిన హ్యాడ్లీ... ఆ సమయంలో చాలా ఇబ్బందులకు గురైనట్లు వెల్లడించాడు. వాంతులు, విరేచనాలు, అజీర్తి సమస్యలతో చాలా ఇబ్బందులకు గురైనట్లు వివరించాడు. ఇది గతేడాది జనవరితో ముగిసిందని వెల్లడించాడు.

ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడలేదు

ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడలేదు

ప్రస్తుతం అంతా బాగేనే ఉందన్న హ్యాడ్లీ ట్రీట్‌మెంట్ సమయంలో 10 కిలోల బరువు తగ్గినట్లు చెప్పాడు. తిరిగి బరువు పెరిగినట్లు చెప్పిన హ్యాడ్లీ.. అన్ని పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నట్లు చెప్పాడు. అదే సమయంలో డైట్‌ కరెక్ట్‌గా మెయిన్‌టెయిన్ చేస్తున్నట్లు చెప్పాడు. ప్రతి మూడునెలలకోసారి హెల్త్ చెకప్ చేసుకుంటున్నట్లు వెల్లడించిన కివీస్ మాజీ స్పీడ్‌స్టర్... టెస్టులు నిర్వహించగా అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే ఇంకా పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడలేదని చెప్పాడు. ఇంకా రెండేళ్ల పాటు కష్టాలు తప్పవని చెప్పాడు. ఈ క్యాన్సర్ వచ్చినట్లు తనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని అయితే ఓ టెస్టు చేసుకునే సమయంలో ఇది బయటపడిందని చెప్పాడు హ్యాడ్లీ. ఈ క్యాన్సర్ వచ్చిన వారు ఐదేళ్లకంటే ఎక్కువగా బతకరని చెప్పారు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయని ఇంకా మూడేళ్లు నెట్టుకురావాలని చెప్పాడు.

బతికుండగానే ఇండోర్ ఫెసిలిటీ పూర్తిచేయాలి

బతికుండగానే ఇండోర్ ఫెసిలిటీ పూర్తిచేయాలి

ఈరోజు బాగానే ఉన్నా రేపు ఏం తిరగబెడుతుందో చెప్పలేమన్న హ్యాడ్లీ ఉన్న ప్రతిరోజు ఆస్వాదించాలని చెప్పాడు. హ్యాడ్లీ ఇండోర్ ఫెసిలిటీని తాను బతికుండగానే ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు హ్యాడ్లీ చెప్పారు. ఇలాంటి కష్టసమయాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించేందుకు ఏదో ఒకటి రిలీఫ్ ఇచ్చే కార్యక్రమాలు చేయాలని చెప్పాడు రిచర్డ్ హ్యాడ్లీ. అందుకే హాగ్లే ఓవల్‌లో ఇండోర్ ఫెసిలిటీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పాడు. దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పాడు హ్యాడ్లీ.

ఇండోర్ ఫెసిలిటీకి చరిత్ర ఉందన్న హ్యాడ్లీ

ఇండోర్ ఫెసిలిటీకి చరిత్ర ఉందన్న హ్యాడ్లీ

1970లో కాంటర్‌బరీ క్రికెట్ అసోసియేషన్‌ ఈ ఇండోర్ ఫెసిలిటీని సొంతం చేసుకుందని చెప్పాడు రిచర్డ్ హ్యాడ్లీ. ఇందులో రెండు ఇండోర్ లేన్లు ఉండేవని ఒక దానిలో స్క్వాష్ కోర్టు మరో దానిలో గోల్ఫ్‌లు ఉండేవని చెప్పాడు. ఇక దీన్ని 80, 90దశకాల్లో అమ్మడం జరిగిందని చెప్పాడు. దీన్ని హార్టీకల్చరల్ సొసైటీ కొనుగోలు చేసినట్లు చెప్పిన హ్యాడ్లీ... క్రికెట్‌కు దీనికి సంబంధం లేకుండా పోయిందని వెల్లడించాడు. ఇక ఆ తర్వాత దీన్ని మరో ఇండోర్ క్రికెట్ ఫెసిలిటీగా తీర్చి దిద్దాలన్న ఆలోచన వచ్చిందని ఇందులో చేంజింగ్ రూమ్స్, మీటింగ్ రూమ్స్, జిమ్‌లాంటి సదుపాయాలను సమకూరుస్తున్నట్లు హ్యాడ్లీ చెప్పాడు. ఇక ఈ ఫెసలిటీకి తనపేరు ఉంటుందని అందుకు చాలా గర్వంగా ఉందని రిచర్డ్ హ్యాడ్లీ చెప్పాడు. ఇక 30 ఏళ్లుగా ఉన్న స్పోర్ట్స్ ట్రస్ట్ ఈ ఫెసిలిటీ కోసం 800వేల డాలర్లు వెచ్చిస్తోందని వెల్లడించాడు.

 చిన్నారులు ఇక్కడే క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలి

చిన్నారులు ఇక్కడే క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలి

ఇక హాగ్లే ఓవల్ గ్రౌండ్‌లో ఉన్న ఈ ఫెసిలిటీ చిన్నారులకోసం అని చెప్పాడు. క్రికెట్‌ ఇక్కడే నేర్చుకుని అందులో రాణించాలనేదే తన కోరికని రిచర్డ్ హ్యాడ్లీ చెప్పాడు. అబ్బాయిలు అమ్మాయిలకు మంచి సామర్థ్యం సత్తా ఉన్న కోచ్‌లు ఉంటారని చెప్పాడు హ్యాడ్లీ. ఔట్‌డోర్ ఫెసిలిటీ, లైట్స్ , గ్రౌండ్, పెవీలియన్‌లు ఇలా అన్నీ ఉన్నాయని చెప్పాడు. ఇందుకోసం డబ్బులు సేకరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిన హ్యాడ్లీ... ప్రస్తుతం తనముందున్న లక్ష్యం అదే అని చెప్పుకొచ్చాడు. అందుకే ప్రతిరోజు ఉదయం కొందరని నిద్ర లేపి సహాయం చేయగలరా అంటూ అడుగుతుంటానని చిరునవ్వుతో చెప్పాడు రిచర్డ్ హ్యాడ్లీ.

Story first published: Saturday, February 29, 2020, 12:28 [IST]
Other articles published on Feb 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+