టీమిండియా హెడ్ కోచ్ రేసులో తెరపైకి కొత్త పేరు!

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను కొత్తగా తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే, సీనియర్ కోచ్‌లు టామ్ మూడీ, గ్యారీ కిరిస్టెన్‌లు ప్రదాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు వార్తలు వచ్చాయి.

రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే
అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు వచ్చే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో ఇప్పటివరకు టీమిండియా హెడ్ కోచ్ రేసులో నలుగురు ఉన్నట్లు సమాచారం. అయితే మరో దిగ్గజ కోచ్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

మాజీ కోచ్ మైక్ హెస్సన్ కూడా
న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఆయన బీసీసీఐకి దరఖాస్తు పంపించే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. న్యూజిలాండ్ జట్టుకు మైక్ హెస్సన్ ఆరేళ్లు కోచ్‌గా పనిచేశారు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కూడా సేవలందించారు.

2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు
మైక్ హెస్సన్ కోచింగ్‌లోనే కివీస్ 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. కాగా, హెడ్ కోచ్ పదవికి గతానికి భిన్నంగా బీసీసీఐ కొన్ని నిబంధలను పెట్టిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవికి ఎంపిక అయ్యే అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఎవరిని ఎంపిక చేసేనో!
దీంతో పాటు ఆ అభ్యర్ధికి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం కూడా ఉండాలని నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, కొత్త కోచ్‌ని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఎంపిక చేయనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications