For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ స్థానంలో బాధ్యతలను పంత్ నెరవేర్చగలడు!!

Former Indian wicket-keeper backs Rishabh Pant as perfect heir to MS Dhoni

హైదరాబాద్: ప్రస్తుత భారత క్రికెట్‌లో ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం కేవలం యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కే ఉందని భారత మాజీ వికెట్‌ కీపర్‌ విజయ్‌ దహియా అన్నాడు. టెస్టు సిరీస్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఆఖరి టెస్టులో సెంచరీ బాది.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో వరుసగా రెండు టెస్టుల్లోనూ 92, 92 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం 2014లో ధోనీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

 స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం

స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం

టెస్టుల్లో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం సెలక్టర్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో వృద్ధిమాన్‌ సాహా, పార్దీవ్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌లకు సెలక్టర్లు చాలా అవకాశాలు ఇచ్చి చూశారు. కానీ వారిలో ఏ ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారని ఈ మాజీ వికెట్‌ కీపర్‌ అన్నాడు. ఈ క్రమంలో ధోనీకి ప్రత్యామ్నాయంగా సరైన ఆటగాడు కేవలం రిషబ్‌ పంతేనని.. ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రంలోనే తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడని ఆయన తెలిపాడు.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయగల సత్తా

ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయగల సత్తా

ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయగల సత్తా ఉన్న వికెట్‌కీపర్‌ కావాలి. దీనికోసం దినేశ్‌ కార్తీక్‌, పార్దీవ్‌ పటేల్‌కు ఎన్నో అవకాశాలు కల్పించారు. కానీ వారు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ఎక్కువ కాలం నిలవలేకపోతున్నారు. సాహాకు కూడా జట్టులో చోటు దక్కినా.. అతను గాయాల కారణంగా తనని తాను నిరూపించుకోలేకపోతున్నాడు. కానీ, రిషబ్‌ పంత్‌ మాత్రం తొలి టెస్టులోనే అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు.

 పార్థీవ్, కార్తీక్‌కి మేనేజ్‌మెంట్ ఛాన్స్‌లు

పార్థీవ్, కార్తీక్‌కి మేనేజ్‌మెంట్ ఛాన్స్‌లు

ధోనీ తర్వాత సాహాతో పాటు పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ ఛాన్స్‌లు ఇచ్చి పరీక్షించింది. కానీ.. వారు విఫలమైయ్యారు. కానీ.. రిషబ్ పంత్.. ఆ అవకాశాల్ని చక్కగా వినియోగించుకుని.. టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని ఆట చూస్తుంటే ధోనీ స్థానాన్ని జట్టులో అతను భర్తీ చేయగలడనిపిస్తోంది.

టెస్టు సిరీస్‌లోనూ సెలక్టర్లు రిషబ్‌కు చోటు

టెస్టు సిరీస్‌లోనూ సెలక్టర్లు రిషబ్‌కు చోటు

ఇటీవల ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన రిషబ్‌ పంత్‌.. ఇప్పటివరకూ ఐదు టెస్టులాడి.. మొత్తం 346పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తాజాగా విండీస్‌ టీ20సిరీస్‌తో పాటు, త్వరలో ఆసీస్‌తో ప్రారంభం కానున్న టీ20, టెస్టు సిరీస్‌లోనూ సెలక్టర్లు రిషబ్‌కు చోటు కల్పించారు.

Story first published: Saturday, November 10, 2018, 11:13 [IST]
Other articles published on Nov 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+