Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nitish Kumar Reddy: పదేళ్ల క్రితమే నితీష్ కుమార్ ను గుర్తించిన ఎంఎస్కే ప్రసాద్..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్‌ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కానీ భారత మాజీ వికెట్ కీపర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ నితిష్ కుమార్ రెడ్డిని పదేళ్ల క్రితమే గుర్తించాడు.

నితీష్ కుమార్ రెడ్డిని మంచి క్రికెటర్ అవుతాడని ఆనాడే చెప్పాడు. నితీష్ ప్రతిభను గుర్తించిన ఎంఎస్కే ప్రసాద్ అతనికి ప్రత్యేక కోచింగ్ ఇప్పించినట్లు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ స్థాయిలో నిలవడంలో ప్రసాద్ పాత్ర కీలకమని పేర్కొన్నారు.టీమ్ ఇండియా కోసం నితీష్ చాలా బాగా రాణిస్తున్నాడని ప్రసాద్ చెప్పారు. ముఖ్యంగా మనం ఉన్న పరిస్థితి, కఠినమైన సమయాల్లో అతను జట్టును నడిపించిన తీరు చూసి తాను కొంచెం భావోద్వేగానికి గురైనట్లు వివరించారు.

Former Indian player MSK Prasad recognized Nitish Kumar ten years ago

నితీష్ ఆట చూసి చాలా గర్వంగా అనిపించిందని ఎంఎస్కే ప్రసాద్ చెప్పారు. నితీష్ రెడ్డికి వాషింగ్టన్ సుందర్ మద్దతు లభించిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 127 పరుగులు జోడించారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సుందర్, జస్ప్రీత్ బుమ్రా వెనవెంటనే ఔట్ కావడంతో నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద మిగిలిపోతారా అని అందరు భావించారని.. కానీ సిరాజ్ సహకారంతో నితీష్ సెంచరీ చేశాడని పేర్కొన్నాడు.

"నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి నా దగ్గర మాటలు లేవు. అతను ఎలివేట్ చేసిన స్థాయిలను చూడండి. ఈ సిరీస్‌లోకి రాకముందు, అతను కొన్ని ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడాడు. కానీ అతని గణాంకాలతో పోలిస్తే, అతను తన పనితీరును ఎలా పెంచుకున్నాడు లేదా పెంచుకున్నాడు, ముఖ్యంగా దీనికి నలుగురు నాణ్యమైన బౌలర్లపై టెస్టు సెంచరీ సాధించడం నమ్మశక్యం కాదు'" అని ప్రసాద్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, December 29, 2024, 9:55 [IST]
Other articles published on Dec 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+