న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఐసీసీ వరల్డ్ కప్‌లో కీపర్‌గా పంత్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి'

Former Indian pacer Zaheer Khan bats for Rishabh Pants inclusion for World Cup 2019

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కి జట్టు మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వాలని మాజీ పేసర్ జహీర్ ఖాన్ సూచించాడు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై ముగిసిన టెస్టు సిరీస్‌‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీ నమోదు చేశాడు.

<strong>ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫ్యాన్ గైడ్: ఎక్కడ, ఎప్పుడు, ఎలా?</strong>ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫ్యాన్ గైడ్: ఎక్కడ, ఎప్పుడు, ఎలా?

సిక్స్‌తో టెస్టుల్లో తన పరుగుల ఖాతా తెరిచిన రిబష్ బంత్ సంచరీని కూడా సిక్స్‌తోనే సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో రిషబ్ పంత్‌కు టెస్టుల్లోనే కాదు, వన్డేల్లోనూ ఆడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ ఊపందుకుంది. కనీసం 25 వన్డేల అనుభవం కూడా లేని పంత్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటివ్వడం మంచిదికాదని కొందరు వాదిస్తోన్న నేపథ్యంలో జహీర్ ఖాన్ స్పందించాడు.

"టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌‌పై ఆలోచించాలి. 25 వన్డేలాడిన తర్వాతే రిషబ్ పంత్‌కి వరల్డ్ కప్‌లో ఛాన్సిస్తామంటే ఎలా?. ఎందుకంటే.. అతను ఆ మార్క్‌ని చేరుకునేందుకు చాలా సమయం పడుతుంది (వాస్తవానికి ప్రపంచకప్‌ లోపు భారత్ జట్టు ఆడే వన్డేలు 25 కంటే చాలా తక్కువ)" అని జహీర్ ఖాన్ అన్నాడు.

<strong>ఆసియాకప్ ఫైనల్లో భారత్ Vs బంగ్లా: టీమిండియా ఏడోసారి సాధించేనా?</strong>ఆసియాకప్ ఫైనల్లో భారత్ Vs బంగ్లా: టీమిండియా ఏడోసారి సాధించేనా?

"మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్‌ స్టైల్‌ని మార్చుకుంటూ రిషబ్ పంత్ భారీ సిక్సర్లు బాదగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అలాంటి ఆట టీమిండియాకి వరల్డ్‌కప్‌లో చాలా అవసరం" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌ ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Thursday, September 27, 2018, 18:09 [IST]
Other articles published on Sep 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X