Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vinod Kambli: ఆస్పత్రిలో నర్స్ తో వినోద్ కాంబ్లీ డ్యాన్స్(Video)..

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతను కోలుకుని అకృతి హెల్త్ సిటీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరినరీ ఇన్ఫెక్షన్, కండరాల తిమ్మిరి కారణంగా కాంబ్లీ ఆసుపత్రిలో చేరాడు. అతను ఆసుపత్రిలో ఉన్న సమయంలో కాంబ్లీ ఉత్సాహపూరిత స్వభావం, అతను ఆసుపత్రి వార్డులో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవి సిబ్బంది, రోగులకు ఉల్లాసాన్ని కలిగించాయి.

కాంబ్లీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు మంచి ఉత్సాహంతో కనిపించాడు. భారత మాజీ ఆటగాడు చేతిలో భారత జెర్సీని ధరించి కనిపించాడు. వైద్యం చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని నెలల క్రితం వినోద్ కాంబ్లీ తన అభిమానుల సహాయంతో రోడ్డుపై నడవలేక ఓ చోట కూర్చున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్‌తో కలిసి వినోద్ కాంబ్లీ తన క్రికెట్ కోచ్ శతాబ్ది పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.

Former Indian cricketer Vinod Kambli discharged from hospital

వినోద్ కాంబ్లీ ఆసుపత్రిలో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్స్ తో కలిసి చక్ దే ఇండియాకు నృత్యం చేశాడు. వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ తో పాటు భారత జట్టులో ఆడాడు. అయితే క్రమశిక్షణ లోపించి క్రికెట్ కు దూరమయ్యాడు. జల్సా చేస్తూ చివరికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. సచిన్ మాత్రం ప్రపంచం గుర్తుంచుకునే క్రికెటర్ అయ్యాడు.

కాంబ్లీ మద్యం, డ్రగ్స్ బానిస అయినట్లు తెలిసింది. దీంతో అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆ తర్వాత వైద్యం చేయించుకుని నార్మల్ అయ్యారు. వినోద్ కాంబ్లీ డ్రగ్ అడిక్షన్ నుంచి కోలుకుంటే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కపిల్ దేవ్ తదితరులు ఇప్పటికే ప్రకటించారు.

Story first published: Thursday, January 2, 2025, 13:03 [IST]
Other articles published on Jan 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+