నేను మాట్లాడకపోవడమే మంచిది.. కామెంట్రీ ప్యానెల్‌లో చోటు దక్కకపోవడంపై సంజయ్ మంజ్రేకర్

న్యూఢిల్లీ: వివాదాస్పద కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ కామెంట్రీ ప్యానె‌ల్‌లో చోటు దక్కని విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, సహచర కామెంటేటర్ హర్షా భోగ్లే పట్ల మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతనిపై వేటు వేసింది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతూ మంజ్రేకర్ బీసీసీఐకి అనేక మెయిల్స్, లేఖలు రాసినా భారత క్రికెట్ బోర్డు కరుణించలేదు. బుద్దిగా బోర్డు నిబందనల మేరకు నడుచుకుంటానని విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఈ సీజన్‌కు మంజ్రేకర్ దూరమయ్యాడు.

నో కామెంట్..

నో కామెంట్..

తాజాగా ఇదే విషయంపై స్పందించమని కోరగా మంజ్రేకర్ నిరాకరించాడు. ఈ వ్యవహరంపై తాను మాట్లాడకపోవడమే మంచిదన్నాడు. ‘కామెంటేటర్‌గా నా వేటుపై కామెంట్ చేయకపోవడమే మంచిది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో ప్రీమ్యాచ్, పోస్ట్ మ్యాచ్ షోలో పాల్గొంటాను. ఫాంటసీ లీగ ఫ్లాట్ ఫామ్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేసేందుకు ఓ న్యూస్ చానె‌ల్‌తో చర్చలు తుది దశకు చేరాయి. కాలమ్స్ కూడా రాస్తాను. అలాగే ఓ ఎఫ్‌ఎమ్ రేడియో చానెల్‌లో అప్‌డేట్స్ ఇవ్వనున్నాను'అని మంజ్రేకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

అపార్ధం చేసుకున్నారు..

అపార్ధం చేసుకున్నారు..

ఇక రవీంద్ర జడేజా విషయంలో తాను చేసిన బిట్స్ అండ్ పీసేస్ వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మంజ్రేకర్ తెలిపాడు. దీనికి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సెన్ కామెంట్రీని ఉదహారణగా పేర్కొన్నాడు. ఓసారి భారత ఆటగాళ్లను ఉద్దేశించి నాజర్ ‘డాంకీస్ ఆన్ ది ఫీల్డ్'అని వ్యాఖ్యానించాడని, దాంతో తీవ్ర దుమారం రేగిందని గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లీష్ భాషను తరుచూ అపార్థం చేసుకోవడం జరుగుతుందని, తన విషయంలో కూడా ఇదే జరిగిందన్నాడు.

మనమంతా సున్నితం..

మనమంతా సున్నితం..

‘భారతీయులమంతా చాలా సున్నితంగా ఉంటాం. విమర్శలను స్వీకరించలేం. అలాగే ఇంగ్లీష్ భాష మల్ల మరో సమస్య. తరుచూ అపార్థం చేసుకుంటాం. దేశంలో చాలా మందికి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ కూడా కాదు. ఈ కారణంగానే నా వ్యాఖ్యలను చాలా సార్లు అపార్ధం చేసుకున్నారు. ఉదహారణకు టెండూల్కర్ విషయంలో నేను చేసిన వ్యాఖ్యలను తీసుకుందాం. గదిలో ఏనుగు ఉందన్న నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తెల్ల ఏనుగు అన్నానని ప్రజలంతా అపార్థం చేసుకున్నారు.

అలా అంటే సరిపోయేది..

అలా అంటే సరిపోయేది..

బిట్స్ అండ్ పీసెస్‌లో కూడా ఇలానే జరిగింది. ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడానని అనుకున్నారు. ఆ సందర్భంలో నాన్ స్పెషలిస్ట్ అని వ్యాఖ్యానిస్తే ఈ గొడవే ఉండేది కాదు. ఒకసారి నాజిర్ హుస్సెన్ కూడా ఇలానే భారత ఆటగాళ్లను ఉద్దేశించి డాంకీస్ ఆన్ ది ఫీల్డ్ అన్నాడు. ఇది ఇంగ్లీష్ సాధారణమైన వ్యాఖ్య. చాలా నెమ్మదిగా కదులుతున్నారనే అర్థం. కానీ ఇది చాలా వివాదాస్పదమైంది. ఇంగ్లీష్ వ్యాఖ్యలతో వచ్చే సమస్య ఇదే. అందరికీ తెలుసు అనుకోవడం తప్పు.'అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్ కోసం భారత్ నుంచి సునీల్ గవాస్కర్, ఎల్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే మరియు అంజుమ్ చోప్రాలు కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు.

MI vs CSK తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు.. ఊరిస్తున్న రికార్డులు!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 18, 2020, 17:47 [IST]
Other articles published on Sep 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X