Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravi Shastri: రోహిత్ శర్మ రిటైర్ అయితే ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే అతను యువకుడు కాదు..!

గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఊహాగానాలు కొనసాగుతోన్నాయి. ముఖ్యంగా అతడు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ ఘోరంగా విఫలమయ్యారు. ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సింగిల్ డిజిట్ స్కోర్‌లను నమోదు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గురువారం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. ఐదో టెస్ట్ కోసం రెగ్యులర్ కెప్టెన్ ప్లేయింగ్ XIలో కనిపిస్తాడో లేదో నిర్ధారించడానికి గంభీర్ నిరాకరించాడు. తాజాగా రోహిత్ ఆటపై భారత్ మాజీ కోచ్, మాజీ క్రికెటర్, కమెంటెటర్ రవి శాస్త్రి స్పందించారు. అతని కష్టాలు కొనసాగితే రోహిత్ కెరీర్ త్వరగా ముగియవచ్చని పేర్కొన్నాడు.

Former Indian cricketer Ravi Shastri reacts to Rohit Sharma s retirement news

పెర్త్‌లో జరిగిన ఓపెనింగ్ టెస్ట్‌కు భారత కెప్టెన్ దూరమయ్యాడు. కానీ అతను లేకుండానే జట్టు విజయం సాధించగలిగిందని గుర్తు చేశాడు.
"అతను తన కెరీర్‌పై కాల్ తీసుకుంటాడు. అయితే అతనేము యువకుడు కాదు. రోహిత్ శర్మ రిటైరైతే అస్సలు షాక్ అవ్వను" అని శాస్త్రి పేర్కొన్నాడు.
చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. నాణ్యమైన ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. కానీ అతను ఆడలేదు. అతను బెంచ్ మీద కూర్చుని ఏమి చేస్తున్నాడు అని ప్రశ్నించాడు.

సిడ్నీలో జనవరి 3 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఆడే భారత జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. తుది జట్టులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఆడడంపై సందిగ్ధత కొనసాగుతోంది.

Story first published: Thursday, January 2, 2025, 17:00 [IST]
Other articles published on Jan 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+