Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ది వాల్’ తీర్పు.. ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!

భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 'విన్నర్ స్టేస్ ఆన్(Winner Stays on)"ఛాలెంజ్‌లో పాల్గొని అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లను ఎంచుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కంటే పాకిస్తాన్ దిగ్గజ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కే రాహుల్ ద్రవిడ్ ప్రాధాన్యతనివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

మొదటి కొన్ని రౌండ్లలో రాహుల్ ద్రవిడ్.. బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, అర్జున రణతుంగ, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్‌ల కంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను బెస్ట్ కెప్టెన్ గా ద్రవిద్ ఎంపిక చేశారు. స్టీవ్ స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా అన్ని ఫార్మాట్లలో కలిపి 117 మ్యాచ్‌లలో 62 విజయాలు సాధించింది.

Former Indian cricketer Rahul Dravid Names MS Dhoni All-Time Best Captain Over Imran Khan and Virat Kohli

అయితే ఆ తర్వాత రౌండ్ లో స్మిత్ కంటే మరో ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ను రాహుల్ ద్రవిడ్ ఎంచుకున్నారు. పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా 2003, 2007లలో వరుసగా వన్డే ప్రపంచ కప్‌లను గెలుచుకోవడమే కాకుండా 324 మ్యాచ్‌ల్లో ఏకంగా 220 విజయాలతో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. తర్వాతి రౌండ్లో అలన్ బార్డర్ కంటే రికీ పాంటింగ్‌ను ఎంచుకున్నప్పటికీ.. ఆ తదుపరి రౌండ్‌లో స్టీవ్ వాను రికీ పాంటింగ్ కంటే మెరుగైన కెప్టెన్‌గా పేర్కొన్నారు. స్టీవ్ వా నాయకత్వంలో ఆస్ట్రేలియా 1999లో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

21 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. 9వ స్థానంలో వచ్చి 9 సిక్సులు

Also Read

21 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. 9వ స్థానంలో వచ్చి 9 సిక్సులు
తదనంతర రౌండ్‌లో స్టీవ్ వా స్థానంలో విరాట్ కోహ్లీని ద్రవిడ్ సెలెక్ట్ చేశారు. భారత్‌కు సారథిగా 213 మ్యాచ్‌ల్లో 135 విజయాలు అందించిన విరాట్ కోహ్లీ రికార్డును ద్రవిడ్ గుర్తించారు. అయితే విరాట్ కోహ్లీ స్థానం ఒక రౌండ్ మాత్రమే నిలిచింది. తదుపరి రౌండ్లో కోహ్లీ కంటే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ను ద్రవిడ్ ఎంచుకున్నారు. 1992లో పాకిస్తాన్ కు ఏకైక వన్డే వరల్డ్ కప్‍‌ను అందించిన ఇమ్రాన్ ఖాన్, కెప్టెన్‌గా 187 మ్యాచ్‌లలో 89 విజయాలు సాధించారు.

Recommended For You

ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ
ఇమ్రాన్ ఖాన్‌ను ఎంచుకున్నప్పటికీ.. తదుపరి రౌండ్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రాహుల్ ద్రవిడ్ జై కొట్టారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ధోనీ, 332 మ్యాచ్‌ల్లో 178 విజయాలు సాధించారు. ధోనీ సారథ్యంలో భారత్ 2007 నుంచి 2013 మధ్య మూడు ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలను గెలవడంతో పాటు టెస్టుల్లో నంబర్-1 ర్యాంకును కూడా సాధించింది. చివరి రౌండ్లో 1975, 1979 ప్రపంచ కప్ లను గెలిపించిన వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌తో పోలిస్తే ఎంఎస్ ధోనీనే అత్యుత్తమ కెప్టెన్ అని ద్రవిడ్ తన ఆఖరి నిర్ణయాన్ని వెల్లడించారు.

Story first published: Saturday, September 12, 2026, 13:15 [IST]
Other articles published on Sep 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+