ఆస్పత్రిలో మాజీ క్రికెటర్: బీసీసీఐకి భార్య లేఖ, స్పందించిన గంగూలీ

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి వడోదరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్(46) కుటుంబానికి భారత ఆటగాళ్లు అండగా నిలిచారు. జాకబ్ మార్టిన్ వైద్యఖర్చుల నిమిత్తం తమ వంతు సహాయం చేసేందుకు పలువురు ఆటగాళ్లు ముందుకొచ్చారు.
గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాకబ్ మార్టిన్ ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో తన భర్త ట్రీట్‌మెంట్ కోసం సహాయం చేయాల్సిందిగా మార్టిన్ భార్య భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాశారు.

రూ. 5 లక్షలను సాయం చేసిన బీసీసీఐ
దీంతో వెంటనే స్పందించిన బీసీసీఐ రూ. 5 లక్షలను సాయం అందించగా.... బరోడా క్రికెట్ అసోసియేషన్ 3 లక్షల రూపాయల సాయం అందించింది. జాకబ్ మార్టిన్ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చుల కోసం ఫండ్స్ సేకరించేందుకు గాను బరోడా క్రికెట్ ఆసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పాటిల్ తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు.

గంగూలీ మాట్లాడుతూ
ఇదిలా ఉంటే, మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "నేను, మార్టిన్ ఒకప్పుడు టీమ్ మేట్స్. తను చాలా కామ్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉండేవాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతడు తొందరగా కోలుకోవాలి. మీరు ఒంటరి వాళ్లు కారు. మేమంతా మీకు తోడున్నాం" అంటూ కుటుంబ సభ్యులకు అండగా నిలిచాడు.

పది వన్డేలాడి మార్టిన్ 158 పరుగులు చేసిన మార్టిన్
గంగూలీతో పాటుగా జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా మార్టిన్‌కు సహాయం చేసేందుకు ముందుకువచ్చారని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్ తెలిపారు. బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకబ్ మార్టిన్ మొత్తం పది వన్డేలాడి మార్టిన్ 158 పరుగులు చేశాడు. 2000-01 సీజన్లో బరోడా తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో జాకబ్‌ది కీలకపాత్ర.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications