Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ క్రికెట్ మనుగడపై రవిశాస్త్రి ఆందోళన..

 former indian cricketer expressed concern about test cricket

భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. T20 ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పెరుగుతున్నందున.. ఆటగాళ్లు ప్రతిభకు కొలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్‌లో ఆరు జట్లు మాత్రమే ఉండాలని నొక్కి చెప్పాడు. క్రికెట్‌ ఫుట్‌బాల్‌ మోడల్‌ వైపు దూసుకుపోతోందని రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన రవిశాస్త్రి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. క్రికెట్ నాణ్యత, పరిణామం పెరగడానికి .. టెస్ట్ క్రికెట్ జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే వన్డే , T20 క్రికెట్‌ జట్లను విస్తరించాలన్నారు. టెస్టు క్రికెట్ నాణ్యత కోల్పోతే.. క్రికెట్ పై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుందని తద్వారా ప్రసారహక్కులు యజమాన్యాలు విముఖుత చూపే పరిస్థితి దాపరిస్తుందని శాస్త్రి స్పష్టం చేశారు.

ఇక అనేక దేశాల్లో పుట్ బాల్ లీగ్ ల మాదిరి క్రికెట్ లీగులు పుట్టుకురావవడంపై ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్రి. భవిష్యత్ లో పరిస్థితి ఇలానే కొనసాగితే.. అది ప్రపంచకప్ నిర్వహించేందుకు దారితీసే అవకాశాలు లేకపోలేదని చెప్పకనే చెప్పాడు. తన దృష్టిలో టెస్ట్ హోదాతో శాశ్వత జట్లు ఉండవని.. ఆరు అత్యుత్తమ జట్లు మాత్రమే ఉంటాయన్నాడు. టెస్ట్ క్రికెట్ ఆట నాణ్యతకు కొలమానమని శాస్త్రి స్పష్టం చేశారు.

Story first published: Saturday, July 23, 2022, 12:00 [IST]
Other articles published on Jul 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+