
ధోనిపై వేటు వేసిన సెలక్టర్లు
దీంతో ఆదివారం నుంచి వెస్టిండిస్‌తో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరిస్‌ల నుంచి ధోనిని సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. ధోనీపై వేటు వేసి సెలక్టర్లు అతని స్థానంలో రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చి, రెండో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ
ఆదివారం నుంచి భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ "అవును.. ఇప్పుడు టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉన్నారు. వాళ్లు గత కొద్దిరోజులుగా బాగానే ఆడుతున్నారు. కానీ.. ఎప్పటికీ ధోనీతో సరితూగలేరు" అని అన్నాడు.

కోహ్లీకి వెలకట్టలేని సాయం
"ఇంకా చెప్పాలంటే కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరు. మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగే బాధ్యతలే కాదు. చాహల్, కుల్దీప్, బుమ్రా లాంటి బౌలర్లకి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెలకట్టలేని సాయం చేస్తున్నాడు" ఆశిష్ నెహ్రా అన్నాడు.

ధోని ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదు
"ఇటీవల ముగిసిన ఆసియా కప్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అతను బ్యాట్‌తో రాణించలేకపోయాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం తప్పకుండా సత్తాచాటతాడు. ధోని ఫామ్ గురించి ఎవరికీ ఏ ఆందోళనలు అవసరం లేదు" అని ఆశిష్ నెహ్రా అన్నాడు.


Click it and Unblock the Notifications












