Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: ఆనందంతో బాణసంచా కాల్చిన స్టేడియమిది.. వైరల్ అవుతోన్న రవి శాస్త్రి ట్వీట్..

Former Indian cricketer and coach Ravi Shastri posted some photos on Twitter regarding Adelaide

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవి శాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది T20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత శాస్త్రి టీమిండియా కోచ్ పదవీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. శాస్త్రి మెంటార్‌షిప్‌లో భారత్ ఆస్ట్రేలియాలో రెండు విదేశీ టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది. గత సంవత్సరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది.

టెస్ట్ సిరీస్
అడిలైడ్ ఓవల్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అడిలైడ్ వెళ్లిన శాస్త్రి స్టేడియం చిత్రాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గతంలో ఈ స్టేడియంలో ఆటగాడిగా, కోచ్ ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. "ఆస్ట్రేలియాలో బాణసంచా కాల్చిన మైదానం ఇది. 2018/19 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ సాధించంది" అని అన్నాడు. అడిలైడ్, మెల్‌బోర్న్‌లలో టెస్ట్ లలో గెలుపొందిన తర్వాత భారత్ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.

వ్యాఖ్యాతగా
భారత కోచ్ పదవీ నుంచి తప్పుకున్న తర్వాత రవి శాస్త్రి వ్యాఖ్యాతగా, విశ్లేషణలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అడిలైడ్‌లో కాసేపట్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి మళ్లీ విజయపథంలోకి రావాలని ఇండియా ఆశిస్తోంది. గ్రూప్-2లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇండియా పాకిస్థాన్, నెదర్లాండ్స్ పై గెలుపొందగా..సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత ఆదివారం జింబాబ్వాతో పోటీ పడనుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో భారత్ గెలిస్తే సెమీస్ కు వెళ్లడం లాంఛనమే..

Story first published: Wednesday, November 2, 2022, 12:30 [IST]
Other articles published on Nov 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+