Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arun lal wedding : 38ఏళ్ల మహిళతో పెళ్లికి రెడీ అయిన 66ఏళ్ల టీమిండియా మాజీ క్రికెటర్.. రెండో పెళ్లికి అంగీకరిం

arun lal going to marry second time with his long time friend at the age of 66Years

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ అరుణ్ లాల్ 66ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్నాడు. మే 2న తన చిరకాల మిత్రురాలైన బుల్ బుల్ సాహాను అతను వివాహం చేసుకోనున్నాడు. బుల్ బుల్ సాహా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె వయస్సు 38ఏళ్లు. వీరిద్దరి మధ్య వయసు అంతరం దాదాపు 30ఏళ్లు ఉండడం గమనార్హం. వివాహ వేడుకను కోల్‌కతాలోని పీర్‌లెస్ ఇన్ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ జంట నెల రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకుంది.

ఇది వరకే వివాహమైనా..

బెంగాల్ రంజీ జట్టు ప్రస్తుత కోచ్ అయిన అరుణ్ లాల్‌కు ఇది వరకే వివాహమైంది. అతని మొదటి భార్య పేరు రీనా. వీరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న తన మొదటి భార్యతోనే లాల్ సహజీవనం చేస్తున్నాడు. ఈక్రమంలో తన మిత్రురాలు అయిన బుల్ బుల్ సాహాను పెళ్లి చేసుకుంటానని మొదటి భార్య రీనాతో చెప్పాడు. అందుకు రీనా కూడా తన సమ్మతి తెలిపింది. ఇక లాల్, సాహా దంపతులు మే 2న పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ మేరకు పెళ్లి పత్రికలు కూడా ఈ జంట ప్రింట్ చేయించింది. అరుణ్ లాల్ తన వివాహానికి ఆహ్వానిస్తూ.. బెంగాల్ క్రికెట్ జట్టు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, తన బంధుమిత్రులందరికీ పెళ్లి పత్రికలు పంపించాడు. వీరి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ ఫోటోలు, పెళ్లి పత్రికల ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

క్యాన్సర్ బారిన పడడంతో కామెంట్రీకి దూరం

అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్‌కు రెగ్యులర్ కామెంటేటర్‌గా 2016వరకు అరుణ్ లాల్ పనిచేశాడు. 2016లో అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా అనే అరుదైన క్యాన్సర్‌తో అతను అనారోగ్య బారిన పడ్డాడు. దీంతో అప్పటి నుంచి కామెంట్రీ మానేశాడు. తదనంతరం ఈ వ్యాధిని అధిగమించిన అరుణ్ లాల్.. ప్రస్తుతం బెంగాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కోచింగ్‌లో బెంగాల్ జట్టు 13ఏళ్ల తర్వాత 2020లో తిరిగి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.

కోచింగ్ స్టాఫ్‌ను మార్చడం లేదు

అరుణ్‌లాల్ వివాహ వార్తల నేపథ్యంలో బెంగాల్ కోచింగ్ స్టాఫ్‌ను మారుస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రస్తుత సెక్రెటరీ స్నేహాశిష్ గంగూలీ ఖండించారు. రాబోయే రంజీ సీజన్ కోసం CAB కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించుకుంటుందని వార్తలు రావడాన్ని తాను చూశానని, ఆ వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారంతో ప్రచురించబడ్డాయని పేర్కొన్నారు. బెంగాల్ జట్టు మంచి క్రికెట్ ఆడుతున్న ఈ సీజన్ మధ్యలో ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదని, కోచింగ్ స్టాఫ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా టీమిండియా తరఫున 1982 -1989 మధ్య కాలంలో అరుణ్‌లాల్ క్రికెట్ ఆడాడు. 16టెస్టులు, 13వన్డేలతో పాటు 65 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Tuesday, April 26, 2022, 16:40 [IST]
Other articles published on Apr 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+