MS Dhoni నయా లుక్.. పోలా అదిరిపోలా!!

Former Indian cricket captain MS Dhonis New Look goes viral

సిమ్లా: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కుటుంబం, సన్నిహితులతో కలిసి విహార యాత్రలో ఉన్నాడు. వారందరూ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని కసుంప్తి సమీపంలో ఉన్నారు. గతరాత్రి మహీ ఇక్కడకు వచ్చాడు. సిమ్లా జిల్లాలో ఉన్న ఆపిల్ బెల్ట్ అయిన రత్నరిని ఆదివారం ధోనీ బృందం సందర్శించవచ్చని సమాచారం తెలుస్తోంది. ధోనీ తన కుటుంబం, సన్నిహితులతో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అందులో మహీ నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ గడ్డంతో మహీ తళుక్కుమన్నాడు. ఐపీఎల్​ 2021లోనూ ధోనీ ఇదే స్టైల్​లో కనిపిస్తాడేమో చూడాలి మరి.

WTC21: ముందుగానే టీ బ్రేక్.. వరుణుడు మళ్లీ వచ్చేనా? భారత్ స్కోర్ ఎంతంటే!!WTC21: ముందుగానే టీ బ్రేక్.. వరుణుడు మళ్లీ వచ్చేనా? భారత్ స్కోర్ ఎంతంటే!!

చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ సిమ్లాకు వచ్చాడని తెలుసుకున్న అతడి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన జిల్లా మేజిస్ట్రేట్​తో పాటు పోలీసు వర్గాలు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే ఫ్యాన్స్​ను మహీ ఏమాత్రం నిరాశ పెట్టలేదు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. అంతేకాదు ఆటోగ్రాఫ్​లు కూడా ఇచ్చాడు. ఈ ఫొటోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్రెంచ్ గడ్డంతో మహీ చాలా బాగున్నాడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ధోనీ కొత్త లుక్ పోలా అదిరిపోలా' అం ఇంకో అభిమాని కామెంట్ చేశాడు.

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు పూర్త‌యిన ఐపీఎల్‌ 2021లో మ‌రో 31 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది. దీనికోసం క‌నీసం 25 రోజుల స‌మ‌యం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామ‌ని బీసీసీఐ ముందునుంచి చెబుతూ వ‌స్తోంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఎలాగూ సాధ్యం కాద‌ని భావించి టోర్నీని యూఏఈకి త‌ర‌లించారు. యూఏఈలో సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంనుండగా.. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది.

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు. ఐపీఎల్ టోర్నీలో 211 మ్యాచులు ఆడి 4669 రన్స్ చేశాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 19, 2021, 21:01 [IST]
Other articles published on Jun 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X