Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా మాజీ టెస్టు క్రికెటర్ కన్నుమూత

Former India Test cricketer Rajinder Pal passes away

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ రాజీందర్ పాల్ బుధవారం కన్నుమూశారు. 80 ఏళ్ల రాజీందర్ పాల్ డెహ్రాడూన్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రవీందర్ పాల్ వెల్లడించారు. రాజీందర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్‌గా పేరుగాంచిన రాజీందర్ పాల్ 1964లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ఆడారు. తొలి ఇన్నింగ్స్ 11 ఓవర్లు వేసి 19 పరుగులిచ్చిన రాజీందర్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు వేసి మూడు పరుగులు ఇచ్చారు.

లెగ్‌ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్‌తో పాటు టీమిండియాలోకి ఆరంగేట్రం చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో రాజీందర్ అద్భుతమైన రికార్డుని నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లాడిన రాజీందర్ 21.89 సగటుతో 337 వికెట్లు తీశారు. ఇందులో 23 సార్లు ఐదు వికెట్లను తీసుకున్నాడు.

కాగా, రాజీందర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత డెహ్రాడూన్‌లో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే స్థిరపడ్డారు. ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ కావడంతో ఆయన కొద్ది రోజుల క్రితం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రాజీందర్ మృతి పట్లు పలువురు క్రికెటర్లు, ప్రముఖలు సంతాపం తెలిపారు.

Story first published: Thursday, May 10, 2018, 18:47 [IST]
Other articles published on May 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+