అందుకే అంబటి రాయుడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు: మాజీ సెలెక్టర్ గగన్ ఖోడా

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ జట్టుకు హైదరాబాద్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్‌ అయిన రాయుడిని కాదని '3డీ' పేరిట తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు సెలెక్టర్లు చోటు కల్పించడాన్ని పలువురు మాజీలు బాహాటంగానే తప్పుబట్టారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో కోహ్లీసేన ఓడటానికి జట్టులో రాయుడులాంటి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ లేకపోవడం కారణమని కూడా మెనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించారు.

అయితే, ఆ మెగా టోర్నీలో ఆడేంత ఆత్మవిశ్వాసం రాయుడికి లేకపోవడమే అతడిని తప్పించడానికి కారణమని నాటి సెలెక్షన్‌ కమిటీ సభ్యుడైన గగన్‌ ఖోడా తాజాగా వెల్లడించాడు. తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు వ్యవహారంపై స్పందించాడు.

ఆత్మవిశ్వాసం కనిపించలేదు..

ఆత్మవిశ్వాసం కనిపించలేదు..

‘అంబటి రాయుడు అపార అనుభవం కలిగిన సీనియర్‌ క్రికెటర్‌. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏడాదిగా అతడికి అవకాశాలు ఇచ్చాం. టోర్నీ ఇంగ్లండ్‌ వేదికగా కావడంతో యువ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోలేదు. కానీ, వాటిని అతడు అందిపుచ్చుకోలేక పోయాడు. వరల్డ్‌కప్‌లో ఆడేంత ఆత్మవిశ్వాసమూ రాయుడిలో కనిపించలేదు. అందుకే అతడిని పక్కకుపెట్టాం' అని ఖోడా వివరించాడు.

రిజర్వ్‌డే ముంచింది..

రిజర్వ్‌డే ముంచింది..

మెగా టోర్నీలో కోహ్లీ సేన ఓటమిపై స్పందిస్తూ.. వర్షంతో రిజర్వ్ డే ఆడటం కూడా ప్రతికూలంగా మారిందన్నాడు. ‘టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఏ విషయంలో బలహీనంగా ఉన్నామనే విషయాన్ని గ్రహించలేకపోయాం. కానీ మాది కానీ ఓ రోజు మమ్మల్ని ఓడించింది. వర్షం కారణంగా రిజర్వ్‌డే ఆడటం కూడా కొంత ప్రతికూలం అయింది. ఫస్ట్ డే ఉన్న మూమేంట్ సెకండ్ డే ఉండదు. అదే జరిగింది.'అని ఖోడా అభిప్రాయపడ్డాడు. ఇక ఆ సమయంలో చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ కూడా రాయుడు వ్యవహారంపై అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఫిట్‌నెస్ అంచనాల్ని అందుకోకపోవడంతోనే రాయుడిని పక్కన పెట్టాల్సివచ్చిందన్నాడు.

పొంతన లేదు..

పొంతన లేదు..

ఇక రాయుడి వేటుపై ఖోడా చెప్పిన కారణానికి.. 2018 చివరిలో హైదరాబాద్ క్రికెటర్ ఆటను కొనియాడుతూ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఓ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాయుడిని ఆకాశానికెత్తిన విరాట్.. తమ నెంబర్ 4 ఆటగాడు అతనేనని ప్రకటించాడు. ఖోడానేమో రాయుడిలో ఆత్మవిశ్వాసం కనబడటం లేదంటున్నాడు. వాస్తవానికి ప్రపంచకప్ ముందు జరిగిన ఐపీఎల్‌లో మినహా.. అన్ని సిరీస్‌ల్లోను రాయుడు రాణించాడు. ఆ ఒక్క ఐపీఎల్‌లోనే ఆశించిన మేర రాణించకపోవడంతో అతన్ని పక్కన పెట్టారు.

త్రీడీ ట్వీట్..

త్రీడీ ట్వీట్..

2018-19లో టీమిండియాలో అవకాశాలు దక్కించుకున్న రాయుడు.. నాలుగో స్థానంలో 47.05 సగటుతో నిలకడగా రాణించాడు. దీంతో.. 2019 వన్డే ప్రపంచకప్‌లో అతను ఆడటం లాంఛనమేనని అంతా ఊహించారు. కానీ.. అనూహ్యంగా త్రీ డైమన్షన్స్ అంటూ వరల్డ్‌కప్ టీమ్‌లో విజయ్ శంకర్‌ని ఎంపిక చేసిన సెలక్టర్లు.. రాయుడికి మొండిచేయి చూపారు.

ఈ వ్యవహారంపై రాయుడు అప్పట్లో త్రీడీ కళ్లద్దాలంటూ ట్వీట్ కూడా చేశాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్, శంకర్ గాయపడ్డా.. స్టాండ్ బై జాబితాలో ఉన్నతనని కాదని రిషభ్ పంత్, మయాంక్‌ను వరల్డ్ కప్ ఆడించడంతో తీవ్రంగా హర్ట్ అయిన రాయుడు.. ఆ టోర్నీ జరుగుతుండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 10, 2020, 8:11 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X