Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీశాంత్‌ ఆగయా.. టీ20 జట్టులో చోటు!!

Former India pacer S Sreesanth named in Kerala squad for Syed Mushtaq Ali T20

తిరువనంతపురం: స్పాట్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా ఏళ్లుగా క్రికెట్‌‌కు దూరమైన భారత పేసర్ ఎస్ శ్రీశాంత్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. శ్రీశాంత్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఆరంభంకానున్న దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో కేరళ జట్టు తరఫున అతడు బరిలో దిగనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే.

కేరళ జట్టులో చోటు:

కేరళ జట్టులో చోటు:

జనవరి 10 నుంచి ముంబైలో జరిగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ కోసం కేరళ క్రికెట్‌ బోర్డు (కేసీఏ) ప్రకటించిన జట్టులో 37 ఏళ్ల ఎస్ శ్రీశాంత్‌కు చోటు దక్కింది. దీంతో ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఏడేళ్ల తర్వాత బరిలోకి దిగనున్నాడు. కేరళ జట్టుకు సంజు శాంసన్ నాయకత్వం వహిస్తారని కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇక సచిన్ బేబీ వైస్ కెప్టెన్ అని పేర్కొన్నారు. బాసిల్ తంపి, జలజ్ సక్సేనా, రాబిన్ ఉతప్ప, విష్ణు వినోద్, సల్మాన్ నిజర్, నిధీష్ ఎండి మరియు ఆసిఫ్ కెఎంలకు జట్టులో చోటు దక్కింది.

మొదటి దేశవాళీ టోర్నీ:

మొదటి దేశవాళీ టోర్నీ:

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎస్ శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ముగిసింది. నిషేధం ముగిసిన తర్వాత శ్రీశాంత్‌ ఆడే మొదటి దేశవాళీ టోర్నీ ఇదే. తన ఎంపికపై భారత పేసర్ సంతోషం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా అందరికి ధన్యవాదాలు తెలిపాడు. శ్రీశాంత్‌ భారత్‌ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన జట్లలో శ్రీశాంత్‌ సభ్యుడు కావడం విశేషం.

సెప్టెంబరుతో శిక్షాకాలం పూర్తి:

సెప్టెంబరుతో శిక్షాకాలం పూర్తి:

శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. జీవితకాల నిషేధంను శ్రీశాంత్‌ సవాల్‌ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్‌ శిక్షాకాలం పూర్తయింది.

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది:

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది:

గతంలో శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ... 'ప్రస్తుతం నా వయసు 36. శిక్ష పూర్తయ్యేసరికి 37 ఏళ్లు వస్తాయి. టెస్టుల్లో ఇప్పటి వరకు 87 వికెట్లు తీశాను. 100 వికెట్లు తీసి నా కెరీర్‌ను ముగించాలనుకుంటున్నా. భారత టెస్ట్ జట్టులో తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం ఉంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో ఆడాలని ఉంది' అని అన్నాడు.

Sydney Test: బర్స్న్‌ అవుట్‌.. వార్నర్‌, పకోస్కీ ఇన్!! ఆస్ట్రేలియా జట్టు ఇదే!

Story first published: Wednesday, December 30, 2020, 19:28 [IST]
Other articles published on Dec 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+