ప్రపంచకప్‌లో దొరికిన ఆణిముత్యం.. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడన్న మాజీ లెజెండ్

ఇంగ్లండ్ చేతిలో ఘోరమైన ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. నాకౌట్ దశకు చేరుకున్న భారత్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టింది. అయితే ఈ టోర్నీలో భారత్‌కు ఒక మంచి ఆటగాడు కూడా దొరికాడని మాజీ లెజెండ్ నిఖిల్ చోప్రా చెప్పాడు.

సూపర్ పెర్ఫామెన్స్
ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత ప్లేయర్లలో అర్షదీప్ సింగ్ ఒకడు. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అతను.. ఈ టోర్నమెంట్లో పది కీలక వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ నుంచే సత్తా చాటిన అర్షదీప్.. ప్రపంచకప్‌లో భారత్‌కు శుభపరిణామమని నిఖిల్ చోప్రా అన్నాడు.

మెచ్యూరిటీ వస్తుంది..
అర్షదీప్ సింగ్ బౌలింగ్ ఈ మెగా టోర్నీలో చాలా మెరుగైందన్న నిఖిల్ చోప్రా.. భవిష్యత్తులో అతని బౌలింగ్ మరింత పదునుగా అవుతుందని కొనియాడాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో మంచి ప్రదర్శన చేయడం వల్ల ఆటగాళ్లకు తమపై తమకు నమ్మకం పెరుగుతుందన్న చోప్రా.. 'ఈ టోర్నీలో భారత్‌కు దక్కిన ఆణిముత్యం అర్షదీప్ సింగ్. దీనిలో అసలు అనుమానమే లేదు' అని తేల్చిచెప్పాడు.

ఆ ఒక్క ఓవర్ వేసే సత్తా..
భవిష్యత్తులో అర్షదీప్ సింగ్ మరింత మెరుగైన బౌలర్‌గా పరిణితి చెందుతాడని చోప్రా జోస్యం చెప్పాడు. 'కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం, ఆ తర్వాత చివర్లో యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించడంలో అర్షదీప్ సింగ్ సక్సెస్ అయ్యాడు. ప్రపంచకప్ వంటి భారీ టోర్నమెంట్లో రాణించడంతో అతని ఆటతీరు చాలా మారిపోతుంది. ఇక ముందు జట్టుకు అవసరమైన సమయంలో ఆట మొత్తాన్ని మార్చేసే ఓవర్ వేసి ఒంటి చేత్తో జట్టును గెలిపించగలననే నమ్మకం వస్తుంది. భవిష్యత్తులో మనం అది కచ్చితంగా చూస్తాం' అని నిఖిల్ చోప్రా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications