Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుండెపోటుతో టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

Former Indian Cricketer VB Chandrasekhar Is No More || Oneindia Telugu
Former India cricketer VB Chandrasekhar passes away

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ జాతీయ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్‌ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. తమిళనాడుకు చెందిన ఈ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ భారత్‌ తరఫున 1988-90 మధ్య కాలంలో ఏడు వన్డేలు ఆడి మొత్తం 88 పరుగులు చేశాడు.

దీంతో చోటు కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఇక, దేశవాళీ క్రికెట్లో తమిళనాడు జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన వీబీ చంద్రశేఖర్‌ 81 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు.

దూకుడైన ఆటకు గుర్తింపు పొందిన చంద్రశేఖర్‌ 1988-89 రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన ఇరానీకప్‌ మ్యాచ్‌లో చంద్రశేఖర్‌ 56 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్‌ తరఫున అదే ఫాస్టెస్ట్‌ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ. రిటైర్మెంట్‌ అనంతరం 2012లో తమిళనాడు కోచ్‌గా, గ్రెగ్‌ ఛాపెల్‌ భారత జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో సెలక్టర్‌గా సేవలు అందించాడు.

ఐపీఎల్‌ టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి ధోనిని తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్నారు.

Story first published: Friday, August 16, 2019, 8:11 [IST]
Other articles published on Aug 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+