Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravichandran Ashwin: అశ్విన్ కూడా ఎంఎస్ ధోనీ లాగా రిటైర్మెంట్ ప్రకటించాడు..

సడెన్ గా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అందిరిని ఆశ్చర్యపరిచాడు. చాలా మంది అశ్విన్ మరికొంత కాలం టీమిండియాకు ఆడాల్సి ఉందని అంటున్నారు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ రిటైర్మెంట్ పై భారత జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. రవిచంద్రన్ అశ్విన్ ఊహించని రిటైర్మెంట్‌ను ఎంఎస్ ధోని ఆశ్చర్యకరమైన రిటైర్మెంట్‌తో పోల్చాడు. భారత మాజీ కెప్టెన్, ధోని కూడా 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.

రవి శాస్త్రి సేన్ రేడియోలో మాట్లాడారు. 2014లో ఎంఎస్ ధోని ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్‌ను గుర్తుచేసుకున్నాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌడ్ లో మ్యాచ్ డ్రా అయిన తర్వాత ధోని వీడ్కోలు పలికాడని పేర్కొన్నాడు. "ఎంఎస్ ధోని లాగా అతను వేచి ఉండడు. MCGలో మ్యాచ్ డ్రా అయిన తర్వాత రవీ, నేను జట్టు సభ్యులతో 5 నిమిషాలు మాట్లాడాలని అన్నాడు. నేను ఓకే చెప్పాను. కేవలం 5 నిమిషాల ప్రసంగంలో తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు" రవి శాస్త్రి గుర్తు చేసుకున్నాడు.

Former India coach Ravi Shastri says Ashwin too has announced retirement like MS Dhoni

"మీకు తెలుసా.. నేను సిడ్నీలో ఉండను. కానీ మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. నేను ఆడడానికి ఐపీఎల్ క్రికెట్ ఉంది" అని శాస్త్రి పేర్కొన్నారు.
ధోయనీకి సన్నిహితంగా ఉండే ఆటగాళ్లలో ఎవరికీ కూడా అతని నిర్ణయం గురించి ఆలోచన లేదని శాస్త్రి చెప్పాడు. అతను 100వ మ్యాచ్ లేదా గొప్ప వీడ్కోలు కోసం వేచి ఉండకుండా వైదొలగాలని నిర్ణించుకున్నాడు. " జట్టు సభ్యులు అందురు షాక్ లో ఉన్నారు. నేను డ్రెస్సింగ్ రూమ్ చుట్టూ చూశాను. అందరులో ఆశ్చర్యంలో ఉన్నారు" అని రవి శాస్త్రి గుర్తు చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్ 105 టెస్టుల్లో 536 వికెట్లు పడగొట్టగా.. 3,474 పరుగులు చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ 2011, నవంబర్ 6న వెస్టీండిస్ తో ఆడాడు.
తన మొదటి వన్డే మ్యాచ్ శ్రీలంకతో 2010 జూన్ 5 ఆడగా.. 116 వన్డే మ్యాచ్ లో 156 వికెట్లు తీయడంతో పాటు 707 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. టెస్ట్ ల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Thursday, December 19, 2024, 14:36 [IST]
Other articles published on Dec 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+