For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనీలాండరింగ్ కేసులో అజహరుద్దీన్‌కు ఈడీ సమన్లు

టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పరిధిలో జరిగిన అవకతవకల వ్యవహారానికి సంబంధించి గురువారం ఈడీ సమన్లు జారీ చేసింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అజహరుద్దీన్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఉప్పల్‌ స్టేడియంకు సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ నుంచి తొలిసారి అజహరుద్దీన్ సమన్లు అందుకున్నారు. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.

Former India Captain Mohammad Azharuddin Summoned by ED Over Money Laundering Allegations

గతేడాది ఫిబ్రవరిలో అజహరుద్దీన్‌ను హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు తప్పించిన విషయం తెలిసిందే. అంతేగాక హెచ్‌సీఏ పనితీరును పరిశీలించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. కాగా, గత హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అజహరుద్దీన్ పై కమిటీ అనర్హత వేటు వేసింది. ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించి నిబంధనలు ఉల్లంఘించినందు అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపింది.

కాగా, మాజీ క్రికెటర్‌తో పాటు కాంగ్రెస్ నేత అయిన అజహరుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక క్రికెట్ కెరీర్ విషయానికొస్తే అజహారుద్దీన్ టీమిండియా సారథిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 6,215 పరుగులు, వన్డేల్లో 9,378 పరుగులు సాధించాడు.

Story first published: Thursday, October 3, 2024, 13:44 [IST]
Other articles published on Oct 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+