న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి అవకాశం: వెంగ్‌సర్కార్

ICC Cricket World Cup 2019 : Dilip Vengsarkar Says India Have 'Fantastic Chance' To Lift World Cup
Former India captain Dilip Vengsarkar says India have fantastic chance to lift World Cup

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి అవకాశమని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 14న టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచిన్, గవాస్కర్‌, దిలీప్ వెంగ్‌సర్కార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ... 'ప్రస్తుత జట్టును చూస్తే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్‌కు ఇది మంచి అవకాశం. విరాట్ సేన కప్ సాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమిండియా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఫైనల్ గురించి ఇప్పుడే అంచనా వేయలేను. టైటిల్ పోరులో నిలిచే సత్తా భారత్‌కు ఉంది. భారత క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. వారికి విజయం చేకూరాలని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నా' అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు.

'ఐపీఎల్‌లో విఫలమైనంత మాత్రాన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదు. టీ20, వన్డే ఫార్మాట్‌కు తేడా ఉంటుంది. వన్డేల్లో అతను కచ్చితంగా తిరిగి పుంజుకుకుంటాడు. ముంబై ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌) యువ క్రికెటర్లకు చక్కటి వేదిక. త్వరలో జరిగే రెండో సీజన్‌లో 160 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో తొలి సీజన్‌లో ఆకట్టుకున్న వాళ్లు ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్నారు. ఈ లీగ్‌ యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది' అని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, May 7, 2019, 12:36 [IST]
Other articles published on May 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X