Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ajit Agarkar: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మాజీ పేస్ బౌల‌ర్.. త్వ‌ర‌లోనే నియామ‌కం

Former India bowler Ajit Agarkar is likely to be appointed as Team India bowling coach.

టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ వ‌చ్చే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. అత‌డు ఎవ‌రో కాదు టీమిండియా మాజీ పేస‌ర్ అజిత్‌ అగార్క‌ర్ అని స‌మాచారం. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్‌ను నియ‌మించే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు అజిత్ అగార్క‌ర్ పేరును టీమిండియాలోని ఓ కీల‌క ఆట‌గాడు బోర్డుకు సూచించాడ‌ని స‌మాచారం. మంచి అనుభ‌వ‌జ్ఞుడైన అజిత్ అగార్క‌ర్ కోచ్‌గా ఉంటే బాగుంటుంద‌ని స‌ద‌రు సీనియ‌ర్ ఆట‌గాడు బీసీసీఐకి తెలిపాడట‌. కొత్త‌గా రాబోయే బౌలింగ్ కోచ్ 2023లో భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు కొన‌సాగుతాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అజిత్ అగార్క‌ర్ నియామ‌కం ఉంటుంద‌ని తెలుస్తోంది. కాగా ప్ర‌స్తుతం ఈ వార్తలు జాతీయ మీడియాలో సైతం ప్రచారంలో ఉన్నాయి.

ప్ర‌స్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మాజీ సీమర్ పరాస్ మాంబ్రే ఉన్నాడు. అయితే మాంబ్రేను ఇండియా ఏ, అండర్ 19 జ‌ట్టు ఆటగాళ్లకు కోచ్‌గా నియ‌మించి, అజిత్ అగార్క‌ర్‌ను సీనియ‌ర్ జ‌ట్టుకు కోచ్‌గా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. 44 ఏళ్ల టీమిండియా మాజీ బౌల‌ర్ అజిత్ అగార్క‌ర్‌ ప్ర‌స్తుతం కామెంటేటర్‌గా, క్రికెట్ విశ్లేష‌కుడిగా రాణిస్తున్నాడు. గ‌తంలో బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌వికి పోటీ ప‌డిన‌ప్ప‌టికీ నిరాశే ఎదురైంది. ఆ ప‌దవిని బీసీసీఐ చేత‌న్ శ‌ర్మ‌కు అప్ప‌గించింది. చేత‌న్ శ‌ర్మ‌నే ప్ర‌స్తుతం టీమిండియాకు చీఫ్ సెలెక్ట‌ర్‌గా ఉన్నాడు.

అంతర్జాయతీయ క్రికెట్‌లో అజిత్ అగార్కర్ 1998 నుంచి 2007 వ‌ర‌కు ఆడాడు. టీమిండియా త‌ర‌ఫున 349 వికెట్లు తీశాడు. మొత్తం 28 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 58 వికెట్లు, వ‌న్డేల్లో 288, టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఓ సెంచ‌రీ, వ‌న్డేల్లో 3 హాఫ్ సెంచ‌రీలు కూడా చేశాడు. 2002లో ఇంగ్లండ్‌లోని ప్ర‌తిష్టాత్మ‌క‌ లార్డ్స్ మైదానంలో సెంచ‌రీ సాధించ‌డం గ‌మ‌నార్హం. కొత్త, పాత బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయడంలో అగార్క‌ర్‌కు మంచి నైపుణ్యం ఉంది.

Story first published: Tuesday, February 22, 2022, 16:03 [IST]
Other articles published on Feb 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+