'స్మిత్, కోహ్లీలలో బెస్ట్ ఎవరో చెప్పలేం.. వన్డేల్లో స్మిత్ కంటే కోహ్లీ ముందున్నాడు'

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ల మధ్య మారథాన్ రేసు జరుగుతోంది. స్మిత్, కోహ్లీలలో బెస్ట్ ఎవరో తేల్చడం కష్టం అని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా పేర్కొన్నారు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్.. యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో పురాగమనం చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు టెస్టుల్లో 134.2 సగటుతో ఏకంగా 671 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా అద్భుత ఆటతో టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో జడేజా స్పందించారు.

బెస్ట్ ఎవరో తేల్చడం కష్టం:
డీడీసీఏలో జరిగిన ఓ కార్యక్రమంలో అజయ్ జడేజా మాట్లాడుతూ... 'స్మిత్, కోహ్లీల మధ్య మారథాన్ రేసు జరుగుతోంది. ఇద్దరిలో బెస్ట్ ఎవరో తేల్చడం చాల కష్టం. కోహ్లీ, స్మిత్ ఒకే దశాబ్దంలో ఆడుతున్నారు కాబట్టి వారిని పోల్చి చూడలేం. ఇద్దరూ ఒకే విధంగా పోరాడుతున్నారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న మారథాన్ రేసు మనం ఆస్వాదించాలి. అయితే వన్డేల్లో స్మిత్ కంటే కోహ్లీ రేసులో ముందున్నాడు' అని జడేజా తెలిపారు.

యాషెష్‌లో హవా:
యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండు ఇన‍్నింగ్స్‌ల్లో స్మిత్ 144 పరుగులు, 142 పరుగులు చేసాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. మూడో టెస్టులో స్మిత్ ఆడలేదు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు సాధించాడు.

టెస్టుల్లో నంబర్‌వన్:
యాషెష్‌లో పరుగుల వరద పారించిన స్మిత్ టెస్టుల్లో కోహ్లీని అధిగమించి నంబర్‌వన్ స్టానాన్ని ఆక్రమించాడు. కోహ్లీ కంటే 34 పాయింట్లు ఎక్కువగా ఉన్న స్మిత్ 937 పాయింట్లతో టాపర్‌గా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 903 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ చెలరేగి తిరిగి నంబర్‌వన్‌గా నిలిచేందుకు అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications