Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకప్పటి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు చిన్న బట్టల షాప్ ఓనర్, పాక్ అంపైర్ దయనీయ స్థితి

Former ICC Elite Panel Pakistan Umpire Asad Rauf Miserable Condition

ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న ఆ పాకిస్థానీ అంపైర్ ఇప్పుడు లాహోర్‌లోని లాండా బజార్‌లో ఓ చిన్న బట్టల షాప్ నడుపుతూ జీవితాన్ని వెల్లదీస్తున్నాడు. ఈ దయనీయ గాథ పాకిస్తాన్‌కు చెందిన అంపైర్ అసద్ రౌఫ్‌కు సంబంధించింది. అతను తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు. రౌఫ్ 2000వ సంవత్సరం నుంచి 2013మధ్య మొత్తం 170అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇందులో 49టెస్టులు, 98 వన్డేలు, 23 టీ20లు ఉన్నాయి. రౌఫ్‌ 2013తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయలేదు. 66ఏళ్ల రౌఫ్ ఒకసారి అంపైరింగ్ వదిలిపెట్టాక మళ్లీ దాని జోలీకి వెళ్లకూడదని నిశ్చితాభిప్రాయంలో ఉన్నాడు. తాను ఎంపైరింగ్ పూర్తిగా వదిలిపెట్టానని అతను పేర్కొన్నాడు. అలాగే తన బట్టల షాప్ వల్ల ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నానని పేర్కొన్నాడు.

2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో రౌఫ్ కూరుకుపోయాడు. బుకీల నుంచి కాస్ట్‌లీ బహుమతులను స్వీకరించి అతను అవినీతికి పాల్పడినట్లు బీసీసీఐ డిసిప్లనరీ కమిటీ నిర్ధారించింది. ఇక 2016లో రౌఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇక ఈ విషయమై పాక్ టీవీ.టీవీతో అతను మాట్లాడుతూ.. 'నాకు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నేను ఐపీఎల్‌లో నా అత్యుత్తమ టైంను వెచ్చించాను. బీసీసీఐ నుంచి ఆరోపణలొచ్చాయి. వారంతట వారే నాపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ' అని తెలిపాడు.

ఇకపోతే ముంబైకి చెందిన ఓ మోడల్ రౌఫ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కూడా అప్పట్లో సంచలనమైంది. 2012లో రౌఫ్ లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటూ సతమతమయ్యాడు. తనను పెళ్లి చేసుకుంటానని రౌఫ్ వాగ్దానం చేయడంతో అతనితో తాను సంబంధం కొనసాగించానని, కానీ అతను తర్వాత మొహం చాటేశాడంటూ ఆ మోడల్ పేర్కొంది. ఇక రౌఫ్ మీద వచ్చిన లైంగిక ఆరోపణల మీద అతన్ని ప్రశ్నించగా.. 10ఏళ్ల క్రితం చెప్పిన మాటే ఇప్పుడు చెబుతున్నా.. అవన్నీ అవాస్తవాలు అంటూ రౌఫ్ తన వైఖరిని పునరుద్ఘాటించాడు. ఆ అమ్మాయి నుంచి సదరు ఆరోపణలు వచ్చాక కూడా నేను నా అంపైరింగ్‌ను కొనసాగించాను. నేను తర్వాతి ఐపీఎల్ సీజన్లో అంపైరింగ్ చేశాను అంటూ అతను పేర్కొన్నాడు. ఏదేమైనా ఒక ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఇలా ఓ చిన్న బట్టల షాపు ద్వారా జీవనం వెళ్లదీసే పరిస్థితి తెచ్చుకోవడం కాస్త చింతించాల్సిన విషయమే.

Story first published: Friday, June 24, 2022, 14:31 [IST]
Other articles published on Jun 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+