Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల పట్ల అసభ్యంగా: దోషిగా తేలిన ఇంగ్లాండ్ క్రికెటర్‌

Former England U-19 captain Shiv Thakor found guilty of sexual offence

హైదరాబాద్: బహిరంగ ప్రదేశంలో ఇద్దరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఇంగ్లాండ్ అండర్-19 మాజీ కెప్టెన్‌ శివ్ థాకూర్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసుని విచారించిన డెర్బీ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో నవంబర్‌ 24న అతడికి శిక్ష ఖరారు చేయనుంది.

ప్రస్తుతం కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. కౌంటీ క్రికెట్‌లో డెర్బీ షైర్‌ తరపున శివ్ థాకూర్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది జూన్‌ 12, 19 తేదీల్లో ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు రావడంతో జులైలో శివ్ థాకూర్‌ అరెస్ట్‌ చేశారు.

విచారణలో భాగంగా బాధితులు ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో శివ్ థాకూర్‌ నేరానికి పాల్పడినట్టు కోర్టు ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తేలడంతో అతడితో డెర్బీ షైర్ జట్టు తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

2014 -16 మధ్య కాలంలో ఈ యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు. గతేడాది జూన్ నుంచి డెర్బీ షైర్ జట్టుకు శివ్ థాకూర్‌ ఆడటం లేదు. ఈ కేసు విచారణకు హాజరైన మొదటి సాక్షి థాకూర్ చాలా కూల్‌గా, చక్కగా మేనేజ్ చేస్తాడని తెలిపాడు. అయితే అతడు ఏం చేశాడో తెలుసని జడ్జి ముందు వెల్లడించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 16, 2017, 18:31 [IST]
Other articles published on Nov 16, 2017
Read in English: Shiv Thakor found guilty
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+