కోహ్లీ సెమీఫైనల్లో ఆడకూడదు.. శాపం పెట్టిన ఇంగ్లండ్ మాజీ లెజెండ్!

మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ లేక తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్ ముందు నెలరోజులపైగా విశ్రాంతి తీసుకున్న అతను.. పునరాగమనంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆసియా కప్‌లో పర్వాలేదనిపించి, పొట్టి ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు.

ప్రపంచకప్‌లో అదరగొడుతున్న కోహ్లీ..
ఆస్ట్రేలియా మైదానాలు కోహ్లీకి తెగ కలిసొచ్చాయి. ఇక్కడ ఆడటం అన్నా అతనికి బాగా ఇష్టం. అందుకే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగుతోందని తెలిసినప్పటి నుంచి సంతోషంగా ఉన్నట్లు కోహ్లీ చెప్పుకున్నాడు. అతను అనుకున్నట్లే ఆసియా కప్‌లో అందుకున్న ఫామ్‌ను ఆసీస్ గడ్డపై కూడా కోహ్లీ కొనసాగించాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో టాస్ స్కోరర్‌గా ఉన్నాడు. అతను పాక్‌పై టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించిన విధానాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు.

సెమీస్‌లో ఆడకూడదన్న కేపీ..
కోహ్లీ మళ్లీ తన బెస్ట్ ఫామ్ అందుకోవడంపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ కెవిన్ పీటర్సన్ సంతోషం వ్యక్తం చేశాడు. 'కోహ్లీ కొంతకాలం ఫామ్ కోల్పోయినప్పుడు నేను అతనికి చాలా మద్దతునిచ్చా. కానీ ఇప్పుడు మాత్రం గురువారం నాడు సెమీఫైనల్‌లో అతను ఆడకూడదు అని కోరుకుంటున్నా. కోహ్లీకి ప్రేక్షకులు కావాలి. ఒక పెద్ద వేదిక కావాలి అంతే.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ కన్నా పెద్ద వేదిక ఏముంటుంది? అందుకే అతను అదరగొడుతున్నాడు. కానీ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై మాత్రం కోహ్లీ ఆడకూడదు. గురువారం రోజు మాత్రం అతని బ్యాటుకు ఆఫ్-డే అయితే చాలు' అని కేపీ అన్నాడు. కేపీ శాపం కోహ్లీకి తగులుతుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

కోహ్లీ వల్లే సూర్య కూడా..!
జట్టుకు ఎంతో కీలకమైన కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో అది మిగతా వాళ్లకు కూడా అంటుకుంటోందని కేపీ చెప్పాడు. 'కోహ్లీ వంటి ఆటగాడు ఫామ్ అందుకోవడం కేవలం భారత్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు శుభపరిణామం. అలాంటి వాడు ఆడుతుంటే మిగతా వాళ్లకు కూడా ఆ ఫామ్ సోకుతుంది సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అంత స్వేచ్ఛగా ఆడటానికి ఒక కారణం కోహ్లీ ఫామ్ అందుకోవడమే' అని కేపీ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications