Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎన్నాళ్లకు!: జెఫ్రీ బాయ్‌కాట్, ఆండ్రూ స్ట్రాస్‌లకు అరుదైన గౌరవం

Former England captains Geoffrey Boycott and Andrew Strauss receive knighthoods

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు జెఫ్రీ బాయ్‌కాట్, ఆండ్రూ స్ట్రాస్‌లకు అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని థెరిసా మే రాజీనామా గౌరవ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో వీరికి ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారాన్ని ఇంగ్లాండ్ ప్రభుత్వం అందజేయనుంది.

ఈ జాబితాలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ... క్రీడారంగం నుంచి వీరిద్దరూ ఎంపికయ్యారు. ఆండ్రూ స్ట్రాస్ ఇంగ్లాండ్ తరుపున 2004-12 మధ్య కాలంలో 100 టెస్టులు ఆడి 40.91 యావరేజితో 7000కు పైగా పరుగులు సాధించాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు రెండు యాషెస్ సిరిస్‌లను గెలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడేళ్ళలోపే ఇంగ్లాండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఫలితంగా ఇంగ్లీష్ గేమ్‌లో అత్యంత శక్తివంతమైన అధికారిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంలో ఆండ్రూ స్ట్రాస్ పాత్ర ఎంతో కీలకం.

ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ప్లవర్ ఇలా

ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ప్లవర్ ఇలా

ఆండ్రూ స్ట్రాస్‌కు నైట్‌హుడ్ పురస్కారంపై ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ప్లవర్ "ఈ గౌరవానికి అతడికి మించి విలువైన వ్యక్తిని నేను ఆలోచించలేను. ఒక ఆటగాడిగా ఆతడు చాలా కఠినంగా ఉండేవాడు, ఇక, కెప్టెన్‌గా జట్టుని నడిపించిన తీరు అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టులోని సహచర ఆటగాళ్లు, సిబ్బందితో అతడు గౌరవించబడ్డాడు" అని తెలిపాడు.

108 టెస్టులు ఆడిన బాయ్‌ కాట్

108 టెస్టులు ఆడిన బాయ్‌ కాట్

ఇక, జెఫ్రీ బాయ్‌కాట్ విషయానికి వస్తే 1964-82 మధ్య కాలంలో 108 టెస్టు లాడాడు. 47.72 యావరేజితో 8114 పరుగులు చేసాడు. ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్. మైక్ బ్రేయర్లీ గాయం బారిన పడటంతో 1978లో నాలుగు టెస్టులకు కెప్టెన్‌గా వ్వవహారించాడు.

నైట్‌హుడ్‌ పురస్కారంపై వివాదాస్పద వ్యాఖ్యలు

నైట్‌హుడ్‌ పురస్కారంపై వివాదాస్పద వ్యాఖ్యలు

ముఖానికి నల్ల రంగు పూసుకుని ఉంటే నైట్‌హుడ్‌ బిరుదు పొందేవాడనంటూ గతంలో జెఫ్రీ బాయ్‌కాట్‌ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. 2017లో ఇంగ్లాండ్-వెస్టిండిస్ జట్ల మధ్య ఎడ్జిబాస్టన్ వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ప్రశ్న, జవాబు సెషన్‌లో చాలా మంది వెస్టిండీస్‌ క్రికెటర్లకు నైట్‌హుడ్‌ బిరుదు ఇవ్వడంపై స్పందించాడు.

ముఖానికి నల్ల రంగు వేసుకుని ఉంటే

ముఖానికి నల్ల రంగు వేసుకుని ఉంటే

ఈ సందర్భంగా 'ముఖానికి నల్ల రంగు వేసుకుని ఉంటే నాకూ ఆ అవార్డు దక్కేది' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇవి జాతివివక్ష వ్యాఖ్యలేనన్న విమర్శల నేపథ్యంలో బాయ్‌కాట్‌ క్షమాపణలు కూడా చెప్పాడు. 'ఎవరినీ గాయపరచాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నేను మాట్లాడింది పూర్తిగా తప్పు. నేను క్షమాపణలు చెబుతున్నా. వెస్టిండీస్‌ క్రికెట్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆ జట్టు ఆటగాళ్లంటే ఎంతో గౌరవం' అని అన్నాడు.

టీవీ కామెంటేటర్‌గా బాగా పాపులర్

టీవీ కామెంటేటర్‌గా బాగా పాపులర్

తన మాజీ ప్రియురాలు మార్గరెట్ మూర్‌పై దాడికి పాల్పడినందుకు 1998లో జెఫ్రీ బాయ్‌కాట్‌కు మూడు నెలల సస్పెండ్‌తో కూడిన జైలు శిక్ష కూడా విధించారు. 2002లో బాయ్‌కాట్ గొంతు క్యాన్సర్ బారిన పడ్డాడు. అయితే, దాని నుంచి పూర్తిగా కొలుకున్న తర్వాత టీవీ కామెంటేటర్‌గా బాగా పాపులర్ అయ్యాడు. ప్రపంచ క్రికెట్‌కు జెఫ్రీ బాయ్‌కాట్ చేసిన సేవలకు గాను ఇన్నాళ్లకు అతడికి సరైన గౌరవం లభించిందని ఇంగ్లీషు అభిమానులు కొనియాడుతున్నారు.

Story first published: Tuesday, September 10, 2019, 13:01 [IST]
Other articles published on Sep 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+