Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India: వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్ అనడం చెత్త వాదన.. చిత్తుగా ఓడిస్తామన్న మాజీ లెజెండ్!

Former England Captain says India is not favourite in ODI World Cup

వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫేవరెట్ కాదని, అదొక చెత్త వాదన అని సంచలన వ్యాఖ్యలు చేశాడో మాజీ లెజెండ్. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టు.. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇంగ్లండే ఫేవరెట్ అంటున్నాడు ఆ జట్టు మాజీ సారధి మైకేల్ వాగన్.

గర్వం మింగేసి ఫాలో అవ్వాలి

గర్వం మింగేసి ఫాలో అవ్వాలి

ఇంగ్లండ్ జట్టు ఆటతీరు ఇటీవలి కాలంలో మారిందని విశ్లేషకులంతా ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని చెప్తున్న ఇంగ్లండ్ మాజీలు ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్ జట్టు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ జట్టని అంటున్నారు. మైకేల్ వాగన్ కూడా ఇదే విషయం చెప్పాడు. అదే సమయంలో తాము పెద్ద జట్టనే గర్వం దిగమింగుకుని భారత్ కూడా ఇంగ్లండ్‌ను అనుసరించాలని సూచించాడు.

నేనైతే అదే చేసేవాడిని

నేనైతే అదే చేసేవాడిని

తను భారత క్రికెట్‌లో ఉంటే కచ్చితంగా ఇంగ్లండ్‌ను ఫాలో అయ్యేవాడినని చెప్పిన వాగన్.. 'నేను ఆస్ట్రేలియాలో ఉంటే.. ఈ టోర్నీలో ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న మైక్ హస్సీని పట్టుకునేవాడిని. అసలు వాళ్లు తెరవెనుక ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడిని. అదే భారత క్రికెట్‌లో ఉంటే గర్వాన్ని మింగేసి స్ఫూర్తి కోసం ఇంగ్లండ్ వైపు చూసేవాడిని' అని తెలిపాడు.

ఇంగ్లండే ఫేవరెట్

ఇంగ్లండే ఫేవరెట్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ట్రెండ్ సెట్టింగ్ టీంగా ఇంగ్లండ్ ఉందని మైకేల్ అన్నాడు. 'వచ్చే ఏడాది భారత్‌లో జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవడం తర్వాతి లక్ష్యం. వాళ్ల దగ్గర మంచి స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్లను ఆ టోర్నమెంట్‌లో కూడా ఫేవరెట్ల జాబితాలో పెట్టకూడదు. భారత్‌లో ఈ ప్రపంచకప్ జరుగుతోంది కాబట్టి.. భారత్‌ను ఫేవరెట్ అంటారు.

అదో చెత్త వాదన. భారత జట్టును కూడా ఇంగ్లండ్ సులభంగా ఓడిస్తుంది. ఇప్పుడే కాదు, మరికొన్నేళ్లపాటు ప్రపంచ క్రికెట్‌ను ఇంగ్లండ్ ఏలుతుంది' అని ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, November 16, 2022, 15:52 [IST]
Other articles published on Nov 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+